ప్రకాశం జిల్లా మొత్తం ఓటర్లు 13,99,006 | - | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లా మొత్తం ఓటర్లు 13,99,006

Jul 15 2026 5:03 AM | Updated on Jul 15 2026 5:03 AM

బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

పర్సెంటేజీ కోసం ఆబ్‌సెంట్‌ను ఎక్కువ చేశారు

78,422 మందిని ఆబ్‌సెంట్‌ కింద చూపించారు

చివరి రెండు రోజుల్లోనే 18 శాతం పూర్తి చేశారట

ఈ నెల 24 వరకూ పొడిగింపుతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, ఓటర్లు

బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026

డిజిటైజ్‌ చేసింది

12,69,595

ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తేల్చేస్తున్నారు. మందగమనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 22 రోజులైనా సరే సగానికి సగం పర్సెంటేజీ కూడా పూర్తి కాలేదు. చివరి వారం రోజుల్లో పరుగులు తీయించినా లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ పంపిణీ, వచ్చిన ఫారాలను డిజిటైజ్‌ చేయడం అనుకున్నంత వేగంగా సాగలేదు. చివరి 4 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 శాతం డిజిటైజ్‌ చేశామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. అధికారిక గణాంకాలే దీనికి నిదర్శనం.

డిజిటైజ్‌ చేసింది

8,21,481

వివిధ కేటగిరీల్లో

లేనివారిగా తేల్చినవి

87,291

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

మ్మడి జిల్లాలో 2752 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో జూన్‌ 15 నుంచి సర్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం జూలై 14తో ముగియాల్సి ఉంది. అయితే ఈ నెల 24వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వెలువడ్డాయి. ముందుగా ప్రకటించిన దానికి ప్రకారం 14వ తేదీతో ముగించాల్సి ఉన్నందున అధికారులు రకరకాలుగా కుస్తీ పట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పర్సెంటేజీ చూపించుకోవటానికి ఆబ్‌సెంట్‌(లేరు)ను ఎక్కువ చేసి చూపించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 78,422 మందిని ఆబ్‌సెంట్‌గా చూపించారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 51460 మంది, మార్కాపురం జిల్లా పరిధిలో 26,962 మందిని ఆబ్‌సెంట్‌గా చూపించారు. ఫారాలు ఇచ్చి సంతకాలు పెట్టని వారిని కూడా ఆబ్‌సెంట్‌ కింది చూపించినట్లు సమాచారం. చివరి రెండు రోజుల ముందు వరకూ 80 శాతం ఉన్న డిజిటైజేషన్‌ చివరి రోజుకు 100 శాతం పూర్తయిందని చూపించారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆబ్‌సెంట్‌ కింద 51460 మంది ఓటర్లు ఉంటే మిగతా కేటగిరీల కింద 77,951 మంది ఓటర్లను చూపించారు. వారిలో చనిపోయిన వారు 40,737, వలసల కింద 23,025 మంది, వేరొక చోట ఓటు కలిగిన వారు 13,746 మంది, ఇతరులు 443 మందిగా తేల్చారు. ఉన్న ఓటర్లలో 1,29,411 మందిని పాత ఓటర్ల జాబితా నుంచి తీసేసినట్లయింది. అలాగే మార్కాపురం జిల్లా పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో మంగళవారం సాయంత్రానికి మొత్తం 87,291 ఓటర్లు పెండింగులో చూపారు. ఇందులో 22,123 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. 28,998 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్టు అధికారులు తేల్చారు. 8,647 మంది ఓటర్లను డబుల్‌ ఎంట్రీలుగా గుర్తించారు. ఫారాలు తీసుకొని ఇవ్వని వారు 561 మందిని ఇతర జాబితాలో చేర్చారు. ఇక 26,962 మంది ఓటర్లను ఆబ్‌సెంట్‌ కింద గుర్తించారు. సర్‌ ప్రోగ్రాం గడువు పొడిగించడంతో అధికారులు వీరిపై దృష్టి సారించాల్సి ఉంది.

వివిధ కేటగిరీల్లో లేనివారిగా తేల్చినవి 1,29,411

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement