
పోలీస్ గ్రీవెన్స్‌కు 80 ఫిర్యాదులు
ఒంగోలు సిటీ: ప్రజా ఫిర్యాదులపై విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని ఎస్పీ దామోదర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 80 మంది బాధితులు హాజరై ఎస్పీ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఫిర్యాదుల పూర్వాపరాలు తెలుసుకున్న ఎస్పీ సంబంధిత స్టేషన్ల పోలీసు అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
గ్రీవెన్స్‌లో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్సీ,ఎస్టీ సెల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.