
సీఎస్ పురం (పామూరు): నంద్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎస్ పురం వడ్డెరపాలేనికి చెందిన వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. సీఎస్ పురం వడ్డెపాలేనికి చెందిన బండారు దేవదాసు (44)కాంక్రీట్ మిషన్లతో నంద్యాలలో భవన నిర్మాణ పనులు చేయిస్తూ జీవిస్తున్నాడు. నిత్యం వాకింగ్ చేసే అలవాటున్న దేవదాసు శనివారం ఉదయం ఎప్పటిలాగే నంద్యాలలో వాకింగ్‌కు వెళ్లి రహదారి పక్కన నడుస్తున్న క్రమంలో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవదాసు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో వడ్డెపాలెంలో విషాదం అలముకుంది. మృతునికి భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.