
పరీక్షిస్తూ..
మెరిట్ జాబితా కోసం ఎదురుచూపులు
కూటమి ప్రభుత్వ తీరుతో
గందరగోళంలో అభ్యర్థులు
మెసేజ్ వస్తేనే వెరిఫికేషన్‌కు
రావాలంటూ ప్రచారం
జిల్లా వ్యాప్తంగా 623 పోస్టులు భర్తీ
21,559 మంది పరీక్షకు హాజరు
ఆందోళనలో అభ్యర్థులు
ఏడాది గడుస్తూ!
విద్యాశాఖ తీరు అధ్వానం
విద్యాశాఖ అధికారుల తీరు అధ్వానంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు డీఎస్సీ అభ్యర్థులను గందరగోళం చేసే విధంగా ఉన్నాయి. అభ్యర్థు మెరిట్ లిస్ట్ , వారి ర్యాంక్స్ విడుదల చేసిన తర్వాతే సెలక్ట్ లిస్ట్ విడుదల చేయాలి. గతంలో ఏ డీఎస్సీ కి లేని విధంగా కొత్త నిబంధనలు విధించడం సరికాదు. ఈ విధానంతో అక్రమాలు జరిగే అవకాశం ఉంది.
– సీహెచ్ వినోద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు
ఒంగోలు సిటీ: జిల్లాలో వివిధ కేటగిరీల కింద 623 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీన డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల జేసింది. మే 15వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించింది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 4 వరకు పరీక్షలు జరిగాయి. 21,559 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 2152 మంది గైర్హాజరయ్యారు. తుది కీని ఆగస్టు 1 తేదీన విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 14న అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో నార్మలైజేషన్ మార్కులతో కలిపి స్కోర్ ఇచ్చింది. అయితే టెట్ వివరాలు విద్యాశాఖ దగ్గర లేకపోవడంతో మెరిట్ జాబితా విడుదలలో జాప్యం జరుగుతోంది. శుక్రవారం టెట్ మార్కులు అప్‌లోడ్ చేసేందుకు చివరి అవకాశంగా విద్యాశాఖ ప్రకటించింది.
భర్తీపై రోజుకో కథనం
మెగా డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను ఊరిస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది దాటిన తర్వాత డీఎస్సీ ప్రకటన చేసింది. పోస్టుల ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి వరకూ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుల కొలువుల భర్తీకి సంబంధించి అధికార పార్టీ అనుకూల మీడియాతో పాటు, రకరకాల సోషల్ మీడియాల్లో రోజుకో కథనం పుట్టుకొస్తుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెరిట్ జాబితాతో సంబంధం లేకుండా అర్హులకు ఫోన్ల ద్వారా మెజేస్‌లు పంపుతామని, వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. వచ్చే నెల 5వ తేదీ నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి చేరిపోతారంటూ ప్రకటనలు వెలువడుతున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చే వారు కరువయ్యారు. ఇంత గందరగోళం మధ్య ఏం జరుగుతుందో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇలా..
డీఎస్సీ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించిన తరువాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియజేసిన తరువాత మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెరిట్ లిస్టు ప్రకటించిన తరువాత రోస్టర్ విధానంలో ఎంపిక చేసిన జాబితాను 1:2 నిష్పత్తిలో ప్రకటించి అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారు. ఇలా ఎంపిక పారదర్శకంగా జరిగేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌లో నిర్వహించిన డీఎస్సీ 2025 పరీక్ష ఫలితాలను విద్యాశాఖ ప్రకటించింది. వాటిని అభ్యర్థుల ఫోన్లకు నేరుగా వివరాలను పంపింది. తాజాగా మెరిట్ జాబితాను ప్రకటించకుండా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులకు మెసేజ్‌లు వస్తాయని వారు జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రానికి వెళ్లి సరిఫికెట్లు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసే అవకాశం లేదు. ఈసారి మెరిట్ లిస్టును సర్టిఫికెట్లు వెరిఫై రోజు ప్రకటిస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తే పారదర్శకతకు అవకాశం లేదని అవినీతికి, పలుకుబడికి అవకాశం ఉందని, అర్హులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఎంపికై న వారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించేందుకు ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించినట్లు తెలుస్తోంది.
14 బృందాల ఏర్పాటు..
మెరిట్ జాబితా ప్రకటించకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మెసేజ్ వచ్చిన అభ్యర్థులు నగర శివారు చెరువుకొమ్ముపాలెంలోని సరస్వతి జూనియర్ కళాశాలలో ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు రావాలంటున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో మండల విద్యాశాఖాధికారులు, ఐటీ సిబ్బంది కూడా ఉంటారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసే విధానంపై బృందాలకు బుధవారం, గురువారం విజయవాడ విద్యాశాఖలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం.
ఎంపిక ప్రక్రియపై రోజుకో రకంగా ప్రచారం
కేటగిరి పోస్టులు
లాంగ్వేజ్ 1 39
ఇంగ్లిష్ 95
హిందీ 23
గణితం 94
భౌతిక శాస్త్రం 24
జీవశాస్త్రం 70
సాంఘికశాస్త్రం 106
పీఈటీ 72
ఎస్‌జీటీ 106
మెగా డీఎస్సీ అంతా గందరగోళంగా తయారైంది. ఏడాది కాలంగా ఉపాధ్యాయ కొలువుల భర్తీపై ప్రభుత్వం నిరుద్యోగులను ఊరిస్తూ వస్తోంది. అర్హత పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఫలితాలు వెల్లడి దగ్గర నుంచి నియామక ప్రక్రియ చేపట్టే వరకూ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది..భర్తీ ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పరీక్షిస్తూ..

పరీక్షిస్తూ..

పరీక్షిస్తూ..