భర్త ఆచూకీ లేడు.. అత్తమామలు వేధిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

భర్త ఆచూకీ లేడు.. అత్తమామలు వేధిస్తున్నారు

Aug 21 2025 8:45 AM | Updated on Aug 21 2025 1:31 PM

35 బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం కలెక్టర్‌ను కలిసిన కందుకూరు సబ్‌ కలెక్టర్‌

పొదిలి: టీ తాగి వస్తానని చెప్పి మార్గమధ్యంలో వదిలేసి వెళ్లిన భర్త ఆచూకీ కోసం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా మాదాపూర్‌ గ్రామానికి చెందిన యువతి బుధవారం పొదిలి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి నగర పంచాయతీ పరిఽధిలోని పోతవరానికి చెందిన బత్తుల కార్తీక్‌ బేల్దారీ పనుల కోసం తెలంగాణ వెళ్లాడు. పని ప్రదేశంలో మాదాపూర్‌కు చెందిన అనూష అనే యువతి పరిచయమైంది. కుటుంబ సభ్యులను ఎదిరించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. భార్యభర్తలు ఇద్దరూ తెలంగాణాలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తొలి రోజుల్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడిచేకొద్దీ వారి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఇటీవల దర్శిలో జరిగిన బంధువుల వివాహానికి భార్యాభర్తలు హాజరయ్యారు. 

ఈ సమయంలో అనూషను వదిలించుకుంటే మంచి సంబంధం చూసి వివాహం చేస్తామని కార్తీక్‌కు తల్లిదండ్రులు నచ్చజెప్పినట్లు సమాచారం. అనూషను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న కార్తీక్‌.. ఆమెతో కలిసి తెలంగాణ పయనమయ్యాడు. ఆర్మూరులో ఆగిన సమయంలో తాను టీ తాగి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఎంత సమయం వేచి చూసినా భర్త తిరిగిరాలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ రావడంతో అనుమానించిన ఆమె తన భర్తను వెతుక్కుంటూ పోతవరం చేరింది. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో అత్తామామలకు ఫోన్‌ చేసింది. రూ.10 లక్షలు కట్నం ఇస్తేనే ఇంటికి రావాలని అటువైపు నుంచి సమాధానం రావడంతో విస్తుపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో పొదిలి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని జరిగిన తతంగంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తాను గర్భవతినని, భర్త ఆచూకీ తెలుసుకుని న్యాయం చేయాలని ఆ యువతి పోలీసులను కోరింది.

కంభం: కంభంలోని ఓ గృహంలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని బుధవారం ఎకై ్సజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. స్థానిక నెహ్రూనగర్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోతురాజుటూరు గ్రామానికి చెందిన కవలకుంట్ల నరేష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 35 గోవా మద్యం ఫుల్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్‌స్‌జ్‌ సీఐ హెచ్చరించారు.

ఒంగోలు జైలుకు అరుణ

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ పెరోల్‌ వ్యవహారంలో అతడి సన్నిహితురాలు అరుణను నెల్లూరు పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్న ఆమెను మేదరమెట్ల వద్ద నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. కావలి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో నెల్లూరు పోలీసులు ఆమెను రాత్రి 10 గంటలకు ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు.

ఒంగోలు సబర్బన్‌: జిల్లా కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియాను బుధవారం కందుకూరు సబ్‌ కలెక్టర్‌ డి.హిమవంశీ కలిశారు. ఇటీవలే కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణను కూడా ఆయన ఛాంబర్‌లో కలిశారు.

భర్త ఇంటికి వెళ్తే రూ.10 లక్షలు తెమ్మంటున్నారు

పొదిలి పోలీస్‌ స్టేషన్‌లో తెలంగాణ యువతి ఫిర్యాదు

భర్త ఆచూకీ లేడు.. అత్తమామలు వేధిస్తున్నారు 1
1/1

భర్త ఆచూకీ లేడు.. అత్తమామలు వేధిస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement