
నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్న మద్యం
ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ వలన మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివారు ప్రాంతాల్లోని శ్రామికుల జీవితాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో మద్యం తాగుతున్న కొందరు వ్యక్తులు కుటుంబ పోషణను పట్టించుకోవడం లేదు. దాంతో భార్యా బిడ్డలు పస్తులుండాల్సి వస్తోంది. పిల్లల ఆకలి బాధలు చూడలేక కొందరు మహిళలు కూలి పనులకు వెళుతున్నారు. మద్యం విక్రయాలను తగ్గించడమే కాకుండా పూర్తిగా మద్య నిషేధం విధించడానికి కృషి చేయాలి.
– కంకణాల రమాదేవి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి