
ప్రాణాల మీదకు తెచ్చిన ట్రిపుల్ రైడింగ్
దర్శి: మితిమీరిన వేగం ఆపై ట్రిపుల్ రైడింగ్ ముగ్గురు యువకులను చావు అంచుల వరకు తీసుకెళ్లింది. దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఎన్‌ఎస్పీ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. అద్దంకి వైపు నుంచి దర్శికి వస్తున్న కారు ఆగి ఉన్న ఆటోను క్రాస్ చేసి ముందుకు వెళ్తోంది. అదే సమయంలో బృందావనానికి చెందిన కాటూరి శ్రీమాన్, కుంటా వంశీ, తోటకూర రుషి అనే ముగ్గురు యువకులు బైక్‌పై వేగంగా వస్తూ కారును ఢీకొట్టారు. కారు రేడియేటర్‌లోకి బైక్ చొచ్చుకెళ్లడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం ధాటికి బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు ఎగిరి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో శ్రీమాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు యువకులు దర్శిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అతివేగంగా కారును ఢీకొట్టిన బైక్
ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు