
అరకొర బస్సులేసి!
న్యూస్‌రీల్
నేటి సాయంత్రం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కొన్ని సర్వీసులకే ఉచిత ప్రయాణం పరిమితం 11,27,398 మంది మహిళలకు కేవలం 325 బస్సుల ఏర్పాటు ఐదు బస్సు డిపోల్లోనూ అరకొర వసతులే ఉచిత బస్సు పథకం వలన ఆర్టీసీకి ఏడాదికి రూ.50 నుంచి రూ.60 కోట్ల నష్టం ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేయకపోతే పరిస్థితేంటన్నది జవాబు లేని ప్రశ్న ఆటోవాలాలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయని రాష్ట్ర ప్రభుత్వం
ప్రకాశం
పోరాట యోధులుదేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన యోధులెందరో ప్రకాశం జిల్లాకు చెందిన వారున్నారు.
కాలయాపన చేసి..
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఒంగోలు సిటీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పురస్కారాలు అందించనున్నట్లు డీఈఓ కిరణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాలోని ఐదు పాఠశాలలను వీటికి ఎంపిక చేస్తామన్నారు. 2025 విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ధ్రువీకరణ నకళ్లతో ఒంగోలులోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్.జీ.ఎఫ్) కార్యాలయంలో ఈ నెల 18వ తేదీ లోపల సంప్రదించాలని తెలిపారు. నకళ్లపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీ సంతకాలు ఉండాలన్నారు.
ఒంగోలు సబర్బన్: ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకుగాను 448 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం ప్రశంస పత్రాలు అందుకోబోతున్న అధికారుల జాబితాను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రకటించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఆగస్టు 15న ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరుకానున్నారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు సేవలను గుర్తించి వారికి ప్రశంస పత్రాలు అందించనున్నారు. వారిలో 23 మంది జిల్లా అధికారులు ఉన్నారు. వారితో పాటు రెవెన్యూ విభాగంలోని 77 మందికి, పోలీస్ విభాగంలోని 36 మందికి ప్రశంస పత్రాలు ఇచ్చేందుకు జాబితాలు సిద్ధం చేశారు. మిగతా అన్ని ప్రభుత్వ విభాగాల్లోని అధికారులకు, సిబ్బందికి కలిపి మొత్తం 345 మందికి కూడా ప్రశంస పత్రాలు అందించనున్నారు. వారితో పాటు స్వాతంత్య్ర సమర యోధుల వారసులను కూడా ఈ సందర్భంగా సన్మానించనున్నారు.
ఒంగోలు మెట్రో: సినీనటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబుకు ఈ నెల 17వ తేదీ నాగభైరవ ఆత్మీయ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు నాగభైరవ సాహిత్యపీఠం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సభలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి, కోనేరు కల్పనకు నాగభైరవ సాహిత్య పురస్కారాన్ని, కె.కె.ఎల్ స్వామికి నాగభైరవ కళా పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీనటుడు రఘుబాబు పాల్గొంటారు. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ నూనె అంకమ్మరావు నిర్వహిస్తారు. కళా సాహిత్యాభిమానులు అందరూ ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని సర్వీసులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడం, తగినన్ని బస్సులు కేటాయించకపోవడం, డిపోల్లో అరకొర వసతులతో అమలు చేయకముందే పథకాన్ని నిరుగారుస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు తమ ఉపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆటోవాలాలు డిమాండ్ చేస్తున్నారు.
ఒంగోలు టౌన్:
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి నాయకులు ఊరువాడా తిరిగి ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది. కానీ ఉచిత బస్సు ప్రయాణం ఊసెత్తకుండా కాలయాపన చేశారు. ఉచిత బస్సు పథకం అమలు చేయడానికి కమిటీ అధ్యయనం చేస్తుందంటూ సాకులు చెబుతూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతుంటే వస్తున్న ఆదరణను చూశాక చెమటలు పట్టిన కూటమి పాలకులకు ఇష్టంలేకపోయినా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకొంది.
మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను ఏ విధంగా అయితే అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారో అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేయడానికి పన్నాగాలు పన్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు కాకుండా కేవలం 5 రకాల బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే అవకాశం లేకుండా ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించలేదు. దాంతో అమలు చేయకముందే ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
11.27 లక్షల మందికి 325 బస్సులు:
జిల్లాలో మొత్తం 11,27,398 మంది మహిళలున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం జిల్లాలోని 38 మండలాల ప్రజలకు గాను కేవలం 325 బస్సులను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో బస్సులో 50 నుంచి 60 మందికి మాత్రమే సిటింగ్ ఉంటుంది. నిలబడి ప్రయాణం చేయడానికి అనుమతిస్తే మరో 50 మందికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కో బస్సులో కేవలం 110 నుంచి 120 మంది మాత్రమే ప్రయాణం చేయొచ్చు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఇప్పటి వరకు 40 శాతం మహిళలు ఉంటారని అంచనా.
ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 70 శాతానికి పైగా మహిళా ప్రయాణికులు పెరగవచ్చని చెబుతున్నారు. ఆ లెక్కన చూసినా రోజుకు 1.05 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇంతమంది మహిళలు ప్రయాణం చేయడానికి కేవలం 325 బస్సులు ఎలా సరిపోతాయో ప్రభుత్వమే చెప్పాలి.
ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఉచితం లేనట్లే...
రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా జిల్లా నుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. విజయవాడ, గుంటూరు ప్రయాణికులు మార్కాపురం వచ్చి వయా దోర్నాల ఘాట్ మీదుగా శ్రీశైలం వెళ్లాలి. అయితే ఘాట్ రోడ్డులో ప్రయాణాలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అనుమతించడంలేదు. దీంతో శ్రీశైలం వెళ్లాలనుకున్న భక్తులకు టికెట్ చెల్లించి వెళ్లాల్సి వస్తుంది. జిల్లాలో బ్రహ్మంగారి మఠం, భైరవకోన, మాలకొండ, శింగరకొండ, సింగరాయకొండలోని దేవాలయాలకు వెళ్లాలంటే ఉచిత బస్సు సౌకర్యం లేకుండా పోతుంది. మాలకొండ, భైరవకోన, శింగరకొండలకు బస్సు సౌకర్యం లేదు. కనుక ఉచిత బస్సు పథకం వర్తించే అవకాశం లేదు. ప్రతి శనివారం మాలకొండకు మహిళా భక్తులు విపరీతంగా వస్తుంటారు. అయినా ఉచిత బస్సు సౌకర్యం ఉండదు కనుక టికెట్ పెట్టుకొని వెళ్లక తప్పదు. కొత్తపట్నం బీచ్‌కు కూడా బస్సు సౌకర్యం లేదు. కొత్తపట్నం వరకు బస్సులో వెళ్లి అక్కడ నుంచి బీచ్‌కు ఆటోల్లో వెళ్లాలి. రామాయపట్నం సంగతి కూడా ఇంతే. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఒంగోలు వచ్చి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళుతుంటారు. తిరుమల ఘాట్ రోడ్డుకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించడంలేదో పాలకులు జవాబు చెప్పాలని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.
బస్సు డిపోల్లో సౌకర్యాలు నిల్...
జిల్లాలో మొత్తం ఐదు బస్సు డిపోలు ఉన్నాయి. ఒంగోలు, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి బస్సు డిపోల్లో సౌకర్యాలు లేవు. మార్కాపురం ఆర్టీసీ డిపో దాదాపుగా శిథిలావస్థకు చేరుకుంది. గిద్దలూరు డిపో కూడా అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో మొత్తం 129 బస్సు డిపోలు ఉండగా వాటిలో చివరి రెండు స్థానాల్లో మార్కాపురం, గిద్దలూరు ఆర్టీసీ డిపోలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పొదిలి డిపోలో నిలబడడానికే స్థలం ఉండదు. కనిగిరి డిపో పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం మరుగుదొడ్డి సౌకర్యాలు లేవు. మంచినీటి వసతి లేదు. భారీ సంఖ్యలో మహిళలు తరలివస్తే వెయింటింగ్ గదులు లేవు. కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సు డిపోల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు అరకొర సౌకర్యాలతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ప్రయాణికుల అవస్థలను గాలికి వదిలేయడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీ బస్సు డిపోల్లో ఇప్పటికే దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. ఉచిత బస్సు సౌకర్యం కోసం ఎక్కువ సంఖ్యలో మహిళలు తరలివస్తే దొంగలకు అడ్డే ఉండదు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఉన్న ఔట్ పోలీసు స్టేషన్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒకరిద్దరు హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికుల రక్షణ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.

అరకొర బస్సులేసి!

అరకొర బస్సులేసి!