
కూటమి మోసాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
పుల్లలచెరువు:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు నిలదీయాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాపాలెం గ్రామంలో గురువారం సర్పంచ్ రవణారెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇది మంది ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ అంటూ హామీలిచ్చారని వాటిలో ఏదీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. నేడు రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, లేనిపోని ఆరోపణలు చేసి కార్యకర్తలపై కేసులు పెట్టడమే పనిగా టీడీపీ వారు పెట్టుకున్నారని అన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అక్రమాలను ప్రజలు గమనించాలన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం వలన ఒక్కో కుటుంబానికి కలిగిన నష్టాన్ని వివరించారు. ముందుగా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు గ్రామంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్.రాములు, వైపాలెం మండల కన్వీనర్ ముసలారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, సర్పంచ్‌లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.కోటిరెడ్డి, జ్యోతి, బాలునాయక్, వెంకటేశ్వర నాయక్, మాజీ సర్పంచ్‌లు రవణారెడ్డి, డి.కోటిరెడ్డి, నాయకులు ఆవుల చెంచురెడ్డి, బ్రహ్మానందరెడ్డి, లక్ష్మానాయక్, యూత్ అధ్యక్షుడు దినేష్‌యాదవ్, హరినాయక్, నాసర్‌రెడ్డి, ఖాసింవలి, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, మహిళా నాయకులు రవణమ్మ, విజయకుమారి పాల్గొన్నారు.