
తిరంగా..ఘనంగా
మార్కాపురం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దీక్షా యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో భాగంగా వెయ్యి మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనను సబ్‌కలెక్టర్ వెంకట సహదిత్ త్రివినాగ్ సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. యువతలో దేశభక్తి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కోర్టుసెంటరు, కంభం సెంటరు, పాత బస్టాండు మీదుగా సాగింది. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహశీల్దార్ చిరంజీవి, సీఐ పీ సుబ్బారావు, సొసైటీ ప్రతినిధి సాయి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.