చంద్రబాబుకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించండి

YSRCP MP Gorantla Madhav request to Amit Shah About Chandrababu - Sakshi

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఎంపీ మాధవ్‌ వినతి

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం హోంశాఖపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి హాజరైన అనంతరం అమిత్‌షాకు మాధవ్‌ వినతిపత్రమిచ్చారు. ఎంపీ మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రజలు తిరస్కరించినా ఇంకా అధికారం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్యంపై బోధించే పాఠశాలను కేంద్ర హోంశాఖ  నెలకొల్పి దాంట్లో చంద్రబాబుకు విద్యాబోధన చేయాలని అమిత్‌షాను కోరానన్నారు. అసభ్య పదజాలంతో ధూషణలు చేయిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టాలని బాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్కూల్‌ ఆఫ్‌ అఫెన్సివ్‌ లాంగ్వేజ్‌ ప్రమోషన్‌ ఈ పనిలోనే ఉందన్నారు. టీడీపీ నేత పట్టాభి ఉపయోగించిన భాష మైనర్లను ప్రభావితం చేసేలా ఉన్నందున పోక్సో చట్టం కింద విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top