తెచ్చిన అప్పు అంతా ఏం చేస్తున్నారు?: లేళ్ల అప్పిరెడ్డి | Ysrcp Mlc Lella Appi Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

తెచ్చిన అప్పు అంతా ఏం చేస్తున్నారు?: లేళ్ల అప్పిరెడ్డి

Apr 22 2026 4:06 PM | Updated on Apr 22 2026 4:29 PM

Ysrcp Mlc Lella Appi Reddy Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు సింగపూర్‌లో షికార్లు చేస్తారా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల కోసం ఖర్చు చేయటానికి డబ్బులు లేవు గానీ.. షికార్లకు డబ్బులుంటాయా? అంటూ నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఏ రైతూ బాగుపడింది లేదు. వ్యవసాయం దండగ అని తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకే ఇప్పుడు మళ్లీ ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోయినా పట్టించుకోవటం లేదు’’ అంటూ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మామిడి, ధాన్యం, పత్తి, మిర్చి, ఉల్లి, టమోటా, మొక్కజొన్న.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేదు. అయినా చంద్రబాబు అధికారులతో ఒక్ సమీక్ష సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదు?. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పని చేస్తుందా?. రైతులను ఆదుకోవడానికి డబ్బుల్లేవంటారా?. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు?. చంద్రబాబు రైతు వ్యతిరేకి. మిగతా రాష్ట్రాల్లో రైతులను అందుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కానీ చంద్రబాబుకు మాత్రం ఆ స్పృహ ఎందుకు లేదు?’’ అంటూ అప్పిరెడ్డి ప్రశ్నించారు.

‘‘ప్రపంచానికి పాఠాలు నేర్పానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. మరి అలాంటి వ్యక్తి తన మంత్రులకు సింగపూర్‌లో ట్రైనింగ్ ఇస్తారట. రైతుల కోసం డబ్బుల్లేవంటూ మంత్రుల విహార యాత్రలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారా?. రైతు సమస్యల పరిష్కారానికి ఒక్క సమీక్ష సమావేశాన్నైనా చంద్రబాబు ఏర్పాటు చేశారా?. రైతులకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమే. ఉచిత విద్యుత్ నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు వైఎస్సార్‌, వైఎస్‌ జగన్ మాత్రమే చేశారు. చంద్రబాబు ఏనాడూ ఏ రైతుకూ మేలు చేయలేదు. రైతుల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement