వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు | YSRCP MLA Matsyarasa Visweswara Raju On Party Change Rumors | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు.. ఊపిరి ఉన్నంతవరకు జగన్‌తోనే: పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు

Jun 10 2024 11:36 AM | Updated on Jun 10 2024 1:49 PM

YSRCP MLA Matsyarasa Visweswara Raju On Party Change Rumour

అల్లూరి సీతారామరాజు: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.

‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్‌ జగన్‌తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. 

.. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

Advertisement
 
Advertisement
Advertisement