
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు.
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం ఖాయమని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల ఆదరణతో వైఎస్సార్‌సీపీకి అద్వితీయమైన బలం వచ్చిందని పేర్కొన్నారు.
‘‘ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి సీఎం జగన్ జననేతగా ఎదిగారు. ఏడాదిన్నరకాలంగా సీఎం జగన్ నవరత్నాలతో నవశకాన్ని తెచ్చారు. టీడీపీ త్వరలోనే తెరమరుగయ్యే పార్టీల్లో ఒకటి. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. లోకేష్‌కు ఇంకా రాజకీయ పరిణతి రాలేదు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి బీజేపీ దిగజారిపోయింది’’ అని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.
చదవండి:
‘కూన’ గణం.. క్రూర గుణం
బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్‌చల్