‘బాలకృష్ణను మించిన సైకో లేరు.. మెంటల్‌ సర్టిఫికెట్‌ కూడా ఆయనకే ఉంది’ | YSRCP Leader Jupudi Prabhakar Slams Balakrishna | Sakshi
Sakshi News home page

‘బాలకృష్ణను మించిన సైకో లేరు.. మెంటల్‌ సర్టిఫికెట్‌ కూడా ఆయనకే ఉంది’

Sep 25 2025 4:16 PM | Updated on Sep 25 2025 7:38 PM

YSRCP Leader Jupudi Prabhakar Slams Balakrishna

తాడేపల్లి : సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అసలు జనంలోకి వస్తే సైకోలా ప్రవర్తించేదెవరో అందరికీ తెలుసంటూ బాలకృష్ణకు చురకలంటించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి.. జగన్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

‘బాలకృష్ణని మించిన సైకో మరొకరు లేరు. మెంటల్ సర్టిఫికెట్ కూడా బాలకృష్ణకే ఉంది. అలాంటి వ్యక్తి మెంటల్ బాలకృష్ణ జగన్‌ని సైకో అంటారా?, జనంలోకి వస్తే సైకోలాగ ప్రవర్తించేదెవరో జనానికి తెలుసు. బాలకృష్ణ (Balakrishna) నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఎమ్మెల్యే బాలకృష్ణ మనసులో ఏదో బాధ పడుతున్నారు.  చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదన్న బాధ ఉందేమో?, సైకో అనే పదం బాలకృష్ణకే కరెక్టుగా సరిపోతుంది

బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. నువ్వు కాల్చినప్పుడు నీ మెంటల్‌ కండీషన్‌ ఏంటి బాలకృష్ణా?, కావాలంటే నీ సోదరి పురందేశ్వరిని అడిగి తెలుసుకో. నిన్ను కాపాడింది ఎవరో గుర్తు తెచ్చుకో. చిరంజీవి, పవన్, బాలకృష్ణ మధ్య ఏవైనా గొడవలు ఉండవచ్చు. ఆ గొడవల మధ్యకు జగన్‌ని ఎందుకు తెస్తున్నారు?, సినిమాలకే బాలకృష్ణ హీరో, కానీ జగన్ ప్రజల్లో హీరో. బాలకృష్ణ నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది’ అని హెచ్చరించారు జూపూడి.

నిన్ను మించిన సైకో మరొకరు లేరు బాలకృష్ణ వ్యాఖ్యలకు జూపూడి స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement