
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సత్తా, తడాఖాను 2024 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి చూస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని చోట్లా విజయం సాధిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ చేతిలో చంద్రబాబు చావుదెబ్బ తినడం ఖాయమని, అంతటితో ఆయన రాజకీయ చరిత్ర ముగుస్తుందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.
► చంద్రబాబు, లోకేశ్ తెచ్చిన జగనాసుర రక్తచరిత్రను ఎవరు చదువుతారు? ఆ పుస్తకాలు చలి మంటలు కాచుకునేందుకే పనికొస్తాయి. ‘ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో ఎలా గొంతు కోశారు?’ అనే పుస్తకాన్ని వారు విడుదలచేస్తే జనం చదువుతారు.
► మామను పొట్టనబెట్టుకుంటే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది. సీఎం జగన్‌కి వైఎస్ వివేకానందరెడ్డి చిన్నాన్న. ఆయన్ను ఎందుకు చంపుకుంటారు? వైఎస్ వివేకా చనిపోతే సీఎం జగన్‌కు ఏమైనా ఆస్తులొచ్చాయా? వివేకా ఆస్తులు ఆయన కుమార్తె, అల్లుడి పేరుమీదకు ఎలా వచ్చాయ్? వైఎస్ వివేకా అప్పట్లో వైఎస్ జగన్‌తో కలిసి నడిచి వచి్చన వ్యక్తి కాదు. వైఎస్ విజయమ్మపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేశారు.
► వైఎస్ జగన్ కుటుంబం నాశనమవ్వాలని కోరుకునే వ్యక్తులు వైఎస్ వివేకా ఫ్యామిలీలో ఉన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబమే సీఎం జగన్ వెంట నడిచింది. వైఎస్ వివేకా బతికి ఉన్నా కడప ఎంపీ సీటును అవినాష్ రెడ్డికే సీఎం జగన్ ఇచ్చేవారు.
► మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ఎలా మభ్యపెట్టారో కూడా చెబుతాం. లోకేశ్‌కు వచి్చంది ఖర్జూరనాయుడు గొంతు అయి ఉంటుంది. ఆయన బస్టాండులో జేబులు కొడుతూ తిరిగేవాడు. వర్ల రామయ్య, పట్టాభి లాంటి వాళ్లు బాబు జీతగాళ్లు.
► మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచి తీరాలని సీఎం ఆదేశించారు. తప్పకుండా విజయం సాధిస్తాం.
చదవండి: సైన్యం సన్నద్ధం