వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి: అమర్నాథ్‌ | YSRCP Gudivada Amarnath Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి: అమర్నాథ్‌

Apr 16 2025 12:52 PM | Updated on Apr 16 2025 1:15 PM

YSRCP Gudivada Amarnath Serious Comments On CBN Govt

సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమి సర్కార్‌ కుట్రలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం విగిపోతుందని చెప్పారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు విప్ జారీచేస్తున్నాము. 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాము. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం మాకు ఉంది. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి.

మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ..‘మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్.. నాకు మేయర్‌గా వకాశం కల్పించారు. బీసీ జనరల్ అయిన సరే యాదవ మహిళకు మేయర్‌గా అవకాశం ఇచ్చారు. యాదవులకు వైఎస్‌ జగన్ పెద్దపీట వేశారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంతవరకు సమంజసం. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించలేదా?. సోదర సమానులైన పల్లా  శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మేయర్‌పై అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం విగిపోయేందుకు కావల్సినంత బలం మాకు ఉంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు 58 మందికి విప్ జారీచేస్తున్నాము’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement