ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy fires on Chandrababu coalition govt | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్‌ జగన్‌

Jul 10 2025 3:30 AM | Updated on Jul 10 2025 7:04 AM

YS Jagan Mohan Reddy fires on Chandrababu coalition govt

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డు వద్దకు భారీ సంఖ్యలో తరలివచి్చన రైతులు, ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ , మామిడి రైతుల సమస్యలను వింటున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

రైతుకు గడ్డు కాలమిది

నేను రైతుల్ని కలవడానికి ఇన్ని ఆంక్షలా?

రైతు సమస్యలను ప్రస్తావించడం కూడా తప్పేనా? 

ఎక్కడా లేని విధంగా ఇన్ని ఆంక్షలు పెట్టడం దుర్మార్గం

కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌  

కిలో మామిడి 2 రూపాయలట.. మరీ ఇంత దారుణమా? 

మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం 

ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే నా పర్యటన 

నన్ను కలవకుండా రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించారు 

అయినా సమస్యలు లేకపోతే ఇంత మంది రైతులు వస్తారా?

జగన్‌ వస్తున్నాడంటే మీకు భయం.. అందుకే ఎక్కడికక్కడ కట్టడి  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కిలో మామిడి రూ.22–29 పలికిన ధర  

ఏటా మే మొదటి వారంలోనే పంట కొనుగోలు 

కూటమి ప్రభుత్వంలో నెల రోజులకు పైగా జాప్యం 

ఫలితంగా దిక్కు తోచని స్థితిలో రైతులు.. పంటల ధ్వంసం 

ఇప్పటికైనా కళ్లు తెరిచి మీ హామీ మేరకు కిలో రూ.12తో ప్రభుత్వమే కొనాలి.. తర్వాత ప్రభుత్వమే మార్కెట్‌లో అమ్ముకోవాలి

కేవలం 500 మంది మాత్రమే రావాలట! అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది? జగన్‌ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు.

ఇవాళ ఇక్కడికి జగన్‌ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్ర­మంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్‌పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయొద్దంటూ బంక్‌ల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా?

మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే  కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్సార్‌సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను.     
-వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రాష్ట్రంలో ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్నారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క­జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా దారుణం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? కిలో మామిడికి కనీసం రెండున్నర రూపా­యలు కూడా రావడం లేదని మామిడి రైతులు చెబుతున్నారు. 

ఇంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్ర­హం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరా­మర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నేను మామిడి రైతుల సమ­స్యలను ఆరా తీసేందుకు ఇక్కడికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. 

అందుకే ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టింది. నా పర్యటనను అడ్డుకు­నేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ రైతులను సైతం అడ్డుకుంది. రైతులకు మంచి జరగకూడదని కోరుకుంటోంది. ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపో­తున్నా కూడా ఎవరూ స్పందించ కూడదని ఉద్దేశంగా పెట్టుకుంది. 

అసలు జగన్‌ రైతుల్ని కలిస్తే తప్పేమిటి? రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యే లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు? జగన్‌ వచ్చాడు కాబట్టి.. జగన్‌ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. 

ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలో మామిడికి కనీసం రూ.12 (టన్నుకు రూ.12 వేలు) వచ్చేలా చూడాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

ఇన్నాళ్లూ గాడిదలు కాశారా?
⇒ చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.. ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు?
⇒ జూన్‌ 3వ వారం వరకు కొనుగోళ్లు ఎందుకు మొదలు కాలేదు?
⇒ ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగేలా ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల జూన్‌ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తడం నిజం కాదా?

⇒ రైతులంతా మామిడి పల్ప్‌ కంపెనీల వద్ద బారులు తీరడం మీకు కనిపించ లేదా? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడింది?
⇒ పల్ప్‌ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోవడం మీకు కనిపించ లేదా? కేజీ మామిడి రూ. 2తో కొంటుండటం వాస్తవం కాదా? మీ పుణ్యాన ఈ పంటకు ఇక ధర రాదనే బాధతో చెట్లను కొట్టేసుకున్న రైతులను బెదిరిస్తారా?

అశేష జనసందోహం నడుమ మార్కెట్‌ యార్డు లోపలికి వెళుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

⇒ చిత్తూరు జిల్లాలో 52 మామిడి పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్‌ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?
⇒ ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8 చొప్పున కొన్నాయి?
⇒ మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఈ రోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి ఉందంటే అది మీ నిర్వాకం కాదా?



⇒ పక్కన కర్ణాటకలో జనతాదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు.. కనీస రేటు అని చెప్పి, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేక­పోయారు? ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు 
కాస్తోంది?
⇒ చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసా­యం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? 

⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభు­త్వంలో రైతులు కేవలం రూ.2 కే కిలో అమ్ము­కుంటున్నారు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టడం భావ్యమా? 
⇒ ఇక్కడికి జగన్‌ వస్తున్నాడని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్‌లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు వాస్తవంగా కనీసం కిలో మామిడికి రూ.2 కూడా రావడం లేదంటే.. మీరు నిద్రపోతున్నారా?

రైతన్నలకు అండగా గత ప్రభుత్వం
మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడు­గునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. ఇదే జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. 

నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్‌ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వెంటనే అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్‌ నోటిఫై చేసే వారు. జాయింట్‌ కలెక్టర్లు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్‌ఫెడ్‌ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్‌ అయ్యి.. ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్‌ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు.

ఇప్పుడవన్నీ కనుమరుగు
ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తలకిందుల­య్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు. ఈ రోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్‌ కూడా అయిపోయింది. జూలైలో ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబు­నాయుడు గారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రాకుండా పోయింది. 

ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఆర్బీకే­లన్నీ నిర్వీర్యమ­య్యాయి. ఈ – క్రాప్‌ లేకుండా పోయింది. రైతులకు నాణ్య­మైన విత్తనాలు, పురుగు మందులు, యూరి­యా, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియో­జకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ కూడా ఇవాళ నిర్వీర్య­మైపోయిన పరిస్థితి. వ్యవసా­యానికి సంబంధించిన అన్ని విభాగాలు ఇవాళ నిర్వీర్యమైపో­యిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.
భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణం
శశిధర్‌రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబానికి చెందిన వారు కాదా? పోలీసుల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది అని అడుగుతున్నా.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది ఆ రంగం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్బంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్‌ చేశారు. ఇది అత్యంత దారుణం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement