ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu Govt Over AP Incidents | Sakshi
Sakshi News home page

ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్‌ జగన్‌

Oct 18 2026 11:32 AM | Updated on Oct 18 2026 12:19 PM

YS Jagan Fires On Chandrababu Govt Over AP Incidents

సాక్షి, తాడేపల్లి: ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చంద్రబాబు సర్కార్ అరాచక పర్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా మూడు రోజులు పలు చోట్ల విధ్వంసకాండ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులపై ఇవాళ(ఆదివారం) తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘మనం  ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా. రాజ్యాంగబద్ద పాలనలో ఉన్నామా  లేదా?. రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉందా? అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు. కనీసం నామినేషన్ల కూడా వేయనివ్వడం లేదు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. అధికారులు కనీసం నామినేషన్‌ పత్రాలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది’’ అంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

‘‘ఎన్నికలకు రెండు రోజుల ముందే రిజర్వేష్లను ఖరారు చేశారు. రిజర్వేషన్‌ ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎందుకు అరెస్ట్‌లు చేస్తున్నారు? ఎందుకు కిడ్నాప్‌లు చేస్తున్నారు?. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసులు కాల్పులు జరపడమేంటి?. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ ఎలా చేస్తారు?. స్థానిక ఎన్నికలకు ముందు నుంచే కుట్రలు మొదలు పెట్టారు’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

‘‘సర్‌ తుది జాబితా కాకుండా జాబితా ద్వారానే ఎన్నికలు .. చెల్లని ఓట్ల ద్వారా ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇష్టానుసారంగా డివిజన్లు, వార్డులను విభజించారు. రిజర్వేషన్లు వారికి  కావాల్సిన  చోట ఇచ్చుకున్నారు. క్యాస్ట్‌, నో డ్యూస్‌ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలను బైండోవర్‌ పేరుతో పోలీసులు బెదిరించారు. ఇన్ని దారుణాలు చేసికూడా ధైరంగా ఎన్నికలకు వెళ్లలేకపోయారు. పార్టనర్‌ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై. నారాసుర రక్త చరిత్ర రాస్తూ.. చంద్రబాబు స్టేట్‌ స్పాన్సర్డ్‌ హింసకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఒక మాఫియా రాజ్యం నడుపుతున్నారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

రెండేళ్లు దాటినా కొంతమంది అధికారులు ట్రాన్స్‌ఫర్‌ కాలేదు. ఇసుక నుంచి మట్టివరకు ఏదీ వదలడం లేదు. నామినేషన్‌ సెంటర్‌లో టీడీపీ గూండాలను పోలీసులు పట్టించుకోరు. మరణాయుధాలతో టీడీపీ గూండాలు తిరుగుతున్నా పట్టించుకోరు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నలుగురితో వెళ్లిన అడ్డుకుంటున్నారు. టీడీపీ గూండాలు నామినేషన్‌ పత్రాలు లాక్కుంటున్నా కూడా పోలీసులు ఏం చేయకుండా సహకరిస్తున్నారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 

 

 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement