హైకోర్టులో వైఎస్సార్‌సీపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ | Punganur Municipal Polls: YSRCP Files Lunch Motion Petition in High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో వైఎస్సార్‌సీపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌

Oct 18 2026 11:17 AM | Updated on Oct 18 2026 11:17 AM

Punganur Municipal Polls: YSRCP Files Lunch Motion Petition in High Court

సాక్షి,తాడేపల్లి: పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని, పోలీసు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ వివాదంపై తిరుపతిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికలలో  పార్టీ అభ్యర్థుల పోటీపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల బరిలో నిలిచి తీరుతామని వెల్లడించారు. ‘పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎక్కడా రాజీ పడదు. ఇది మా అభ్యర్థుల హక్కు. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవడానికి, మా అభ్యర్థుల న్యాయమైన హక్కులను కాపాడటానికి ఎంతటి న్యాయ పోరాటానికైనా మేము సిద్ధం’అని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement