సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై పునేఠాకు ఫిర్యాదు చేశారు.
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో విధ్వంస కాండ, వైఎస్సార్సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు, వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పేపర్లు చింపివేయడం. లోక్సభ పక్షనేత పీవీ మిథున్రెడ్డిపై పుంగనూరులో హత్యాయత్నం, పులివెందులలో పోలీసులు గాలిలోకి కాల్పులు, బాష్పవాయు ప్రయోగం తదితర హింసాకాండలపై ఎన్నికల కమిషనర్కు వివరించనున్నారు.
ఇదీ చదవండి: సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు


