మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్‌ జగన్‌

Oct 18 2026 12:55 PM | Updated on Oct 18 2026 1:34 PM

YS Jagan Comments On Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: మున్సిపల్‌  ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదని.. కూటమి హామీలు గాలికెగిరిపోయాయి కాబట్టే అరాచకాలు అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాటే విష విత్తనాలు రేపు చెట్లు అవుతాయన్నారు. ఎవరెవరు అన్యాయాలు చేస్తున్నారో సాక్ష్యాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

అన్యాయం చేసిన ప్రతి అధికారిని చట్టం ముందు నిలబెడతాం. మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం. మీరు చేసే తప్పుడు పనులకు శిక్ష తప్పదు. తప్పులు చేసిన వారు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తాం. కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. సీఎం ప్రజాస్వామ్యబద్ధంగా లేకుంటే వ్యవస్థలు కుప్పకూలుతుంది. మీరు ప్రజాస్వామ్యానికి సెల్యూట్‌ చేయాలి.. చంద్రబాబుకు కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్టింగ్‌ లైన్‌. 2029 ఎన్నికలు ఫినిషింగ్‌ లైన్‌. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పట్టుదలే బాబు సర్కార్‌ను దించేస్తుంది. వైఎస్సార్‌సీపీ ప్రజల గొంతుకై నిలబడుతుంది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీఈసీ నియామకంపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement