బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్‌ జగన్‌ | Corruption Is Chandrababu Mark Of Politics: YS Jagan | Sakshi
Sakshi News home page

బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్‌ జగన్‌

Oct 18 2026 12:31 PM | Updated on Oct 18 2026 12:54 PM

Corruption Is Chandrababu Mark Of Politics: YS Jagan

సాక్షి, తాడేపల్లి: అవినీతి, అరాచకం, చంద్రబాబు మార్క్‌ రాజకీయం అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపే ధైర్యం బాబుకు లేదు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే మా అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర.. బాబు హయాంలో సీఎస్‌గా చేశారు. ఎస్‌ఈసీ  అనిల్‌ చంద్ర పునేఠా చంద్రబాబుకు కరడుగట్టిన మనిషి. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మిథున్‌రెడ్డి సెక్యూరిటీపై కూడా దాడులు చేశారు. ఆర్వో దగ్గర మూడు గంటలు వేచి ఉన్నా నామినేషన్‌ తీసుకోలేదు. ఆయుధాలతో టీడీపీ గూండాలను ఎలా అనుమతించారు. ధ్వంసమైన కారులో మద్యం బాటిళ్లు పెట్టారు.

తిరుబడిన కారులో మద్యం బాటిళ్లు మాత్రం నిలబడే ఉన్నాయి. ఎంపీ కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని కేసులు పెట్టారు. దాడులు చేస్తామని శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు బెదిరించాడు. పోలీసుల మైక్‌ లాక్కుని శాప్‌ ఛైర్మ న్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలు గాలికెగిరి పోయాయి. ప్రజలను చంద్రబాబు బుల్డోజ్‌ చేయలేరు. బాండ్‌లు చూపి ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

పుంగనూరులో నయాజ్‌ భార్య నామినేషన్‌వేయకుండా కొట్టారు. పోలీసుల ముందే నయాజ్‌ను కొట్టినా పట్టించుకోలేదు. తిరుపతి మేయర్‌ అభ్యర్థిని నామినేషన్‌ వేయనివ్వలేదు. ఎంపీ గురుమూరి​‍ వద్ద పత్రాలు లాక్కుని చించివేశారు. పోలీసుల సమక్షంలోనే  నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని ఎస్పీని వేడుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వేడుకున్నా.. నామినేషన్‌ వేయనివ్వలేదు. పోలీసులు ఎందుకు బాబు వాచ్‌మెన్లుగా తయారవుతున్నారు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

 

 

 

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement