కవి రానాపై రెచ్చిపోయిన యూపీ మంత్రి

 Whoever stands against Indians will killed in encounter:UP Minister - Sakshi

వాళ్లను ఎన్‌కౌంటర్‌  చేయాలి: యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

భారతీయులను వ్యతిరేకించిన వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

ప్రముఖ ఉర్దూ కవి మున్నావర్  రానాకు మంత్రి కౌంటర్‌

సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఎన్‌కౌంటర్‌లో  హత్య చేయాలని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఉర్దూ కవి మున్నావర్  రానాను ఉద్దేశించి ఆయన  ఈ  వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 రానున్న ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే తాను రాష్ట్రాన్ని విడిచిపెడతానని ఇటీవల కవి రానా ప్రకటించారు. దీనికి  కౌంటర్‌ ఇచ్చిన యూపీ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1947 విభజన తరువాత కూడా దేశంలో ఉంటూ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమవుతున్న వారిలో రానా ఒకరని శుక్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. కాగా యూపీ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రవేశాన్ని రానా వ్యతిరేకించారు. ఇలాంటి నేతలు ముస్లింల మధ్య చీలికలు తెచ్చి వారిని నాశనం చేస్తున్నారని  విమర్శించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top