
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిసిన సంగతి తెలిసిందే. అయితే బాబుతో గంటపాటు మాట్లాడి బయటకు వచ్చిన మందకృష్ణ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళలను అవమానించినట్లే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందంటే అది హోంమంత్రినే కాదు, ప్రభుత్వం, చంద్రబాబును అన్నట్లే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే బాబును కలిసిన తర్వాత మందకృష్ణ.. పవన్‌ను ఎందుకు తిట్టాడన్న సందేహం ఆయన అభిమానులకు రాలేదంటారా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ అభిమానులు కృష్ణ మాదిగని తిడుతున్నారు కానీ.. ఆయనతో తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడం లేదని తెలిపారు. ఇదే చంద్రబాబు మార్క్ రాజకీయమని అన్నారు.
చంద్రబాబుని కలిసి ఆయనతో ఓక్క గంట మాట్లాడిన తరువాత బయటికి వచ్చి కృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ ను తిట్టారు.
బాబుని కలిసిన తర్వాత ఎందుకు పవన్ ని తిట్టాడు అన్న సందేహం రాలేదంటారా పవన్ కళ్యాణ్ అభిమానులకు?
కృష్ణ మాదిగని తిడుతున్నారు కాని కృష్ణ మాదిగ చేత పవన్ కళ్యాణ్ ని తిట్టించిన చంద్రబాబు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2024