ఆ విషయం తెలిస్తే సంజయ్‌ రౌత్‌ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

Uddhav Will Beat Sanjay Raut With Chappal Says Narayan Rane - Sakshi

ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్‌ గురించి తనకు తెలిసిన రహస్యాలు చెబితే ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి.. రౌత్‌ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉద్ధవ్‌ను కలిసి రౌత్ తనతో చెప్పిన విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అప్పుడు రౌత్ నిజస్వరూపం ఆయనకు తెలుస్తుందన్నారు.

'నేను రాజ్యసభ సభ్యుడినయ్యాక.. సంజయ్ రౌత్ నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చునేవారు. ఉద్ధవ్, ఆయన భార్య రష్మి గురించి నాతో చెప్పేవారు. ఆ రహస్యాలు ఎంటో ఉద్ధవ్‌, రష్మికి చెబితే వారు రౌత్‌ను చెప్పుతో కొడతారు' అని నారయణ్ రాణె చెప్పారు.

శివసేనను ఖతం చేసేందుకు రౌత్ సుపారీ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాణె. శివసేన స్థాపించిన 1969 నుంచి తాను పార్టీ కోసం పనిచేసినట్లు వివరించారు. సంజయ్ రౌత్ వల్లే శివసేన(ఉద్ధవ్) ఎమ్మెల్యేల సంఖ్య 56 నుంచి 12కు పతనమైందని విమర్శించారు.

నారాయణ రాణె కేంద్రమంత్రి హోదాలో కాకుండా సాధారణ వ్యక్తిలా వచ్చి తనను కలవాలని రౌత్ శుక్రవారం సవాల్ చేశారు. ఆ మరునాడే రాణె తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, రౌత్ ఎక్కిడికి రమ్మంటే అక్కడకు వెళ్లి కలిసేందుకు సిద్దమని సవాల్‌ను స్వీకరించారు.
చదవండి: మోదీ హయాంలో రెండు రకాల భారత్‌లు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top