మోదీ హయాంలో రెండు రకాల భారత్‌లు

Rahul Gandhi Says Two Indias Exist Under PM Modi Regime - Sakshi

పానిపట్‌: ‘‘నరేంద్ర మోదీ ఏలుబడిలో రెండు రకాల భారత్‌లు కనిపిస్తున్నాయి. ఒకటి కోట్లాది కార్మికులు, రైతులు, నిరుద్యోగులది. రెండోది దేశంలోని సగం సంపదను గుప్పెట్లో ఉంచుకున్న 100 మంది ధనికులది’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ చెబుతున్న హిందుస్తాన్‌ నిజ స్వరూపం ఇదేనని ఎద్దేవా చేశారు.

శుక్రవారం జోడో యాత్ర సందర్భంగా హరియాణాలోని పానిపట్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్‌ మాట్లాడారు. దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం వస్తుసేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దు విధానాలను ఆయుధంగా వాడుకుందని ఆరోపించారు. 

ఇదీ చదవండి: Joshimath Sinking: దేవభూమికి బీటలు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top