పోడు భూములపై నిఘా

Tpcc Wants To Keep An Eye On The Forest Lands - Sakshi

ఈనెల 14 నుంచి జనజాగరణ యాత్ర 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై త్రిసభ్య కమిటీ 

టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పోడు భూములపై నిఘా పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పోడు భూములను టీఆర్‌ఎస్‌ నేతలు బినామీల పేరుతో కబ్జాలు చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా వం దలాది ఎకరాలు టీఆర్‌ఎస్‌ నేతల చేతుల్లో ఉన్నాయని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అభిప్రాయపడింది. కమిటీ కన్వీనర్‌ షబ్బీ ర్‌ అలీ అధ్యక్షతన బుధవారం కొంపల్లిలోని కార్యకర్తల శిక్షణా శిబిరం ప్రాంగణంలో పీఏసీ సమా వేశం జరిగింది. పోడు భూములపై జరిగిన చర్చలో పార్టీ నేతలు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతలు పోడు భూములను ఆక్రమించుకుంటున్నారని, అ టవీ అధికారులు వారి జోలికి వెళ్లకుండా గిరిజనులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. దీనిపై కలసివచ్చే పార్టీలతో నిఘా పెట్టాలని నిర్ణయించారు.  

స్థానిక సంస్థల ఎన్నికలపై.. 
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నిర్ణయాన్ని జిల్లా నేతలకే అప్పగించాలని పీఏసీ నిర్ణయించింది. అన్ని జిల్లాల నేతలతో కలిసి నిర్ణయం తీసుకునేందుకు దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, బలరాంనాయక్‌ల నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈనెల 14 నుంచి ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించే జనజాగరణ యాత్రను ఎన్నికల కోడ్‌ నిబంధనల మేరకు నిర్వహిస్తామని షబ్బీర్‌ అలీ చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేశ్‌గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

13న ఢిల్లీకి టీపీసీసీ నేతలు 
హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఘోరపరాజయంపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనిపై ఇప్పటికే నివేదిక ఇచ్చేందుకు కర్ణాటకకు చెందిన సీనియర్‌ నేత మత్‌ను పరిశీలకుడిగా నియమించిన ఏఐసీసీ తాజాగా రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచింది. అభ్యర్థి బల్మూరి వెంకట్‌తోపాటు స్థానిక ముఖ్య నేతలు, హుజూరాబాద్‌ ఎన్నికల ఇన్‌చార్జి దామోదర రాజనర్సింహ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శులు ఈనెల 13న ఢిల్లీకి రావాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ఆదేశించినట్టు సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top