ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతామంటే కుదరదు  

Telangana: Jagadish Reddy Fires On Bandi Sanjay - Sakshi

బండి సంజయ్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రైతాంగం మొన్ననే నిన్ను తరిమి కొట్టింది. దేశ రైతాంగం చైతన్యమై మీ మెడలు వంచి క్షమాపణలు చెప్పించింది. అది గుర్తు పెట్టుకొని మసలుకోండి. ఇక నుండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతాం అంటే కుదరదు’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ను రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, గొంగిడి సునీత, మెతుకు ఆనంద్, కంచర్ల భూపాల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

బండి సంజయ్‌ మతిస్థిమితం, సోయి లేకుండా మాట్లాడుతున్నా డని మండిపడ్డారు. ఏదో చెప్పబోయి మరేదో చెప్పి రైతులను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. ‘బాయిల్డ్‌ రైస్‌ తీసుకుంటారా ? లేదా?’స్పష్టం చేయాలని బండి సంజయ్‌ని కోరా రు. వానాకాలంలో పండిన మొత్తం ధాన్యం కేం ద్రం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని కేంద్ర మంత్రి అంటుంటే, ఇక్కడి బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతూ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top