మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్‌ షాక్ | Telangana Govt Revokes Konda Surekha Security | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్‌ షాక్

Sep 4 2026 9:06 PM | Updated on Sep 4 2026 9:06 PM

Telangana Govt Revokes Konda Surekha Security

సాక్షి,హైదరాబాద్‌: మాజీ మంత్రి కొండా సురేఖకు తెలంగాణ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించిన సర్కార్, తాజాగా ఆమెకు కల్పించిన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పాటు ఆమెకు కేటాయించిన 4+4 గన్‌మెన్ల భద్రతను కూడా పూర్తిగా రద్దు చేసింది.

కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌తో పాటు భద్రతను కూడా తొలగించడంతో హనుమకొండలోని ఆమె నివాసం వద్ద ఉన్న పోలీస్ సెక్యూరిటీని అధికారులు వెంటనే వెనక్కి తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు కొండా సురేఖ అనుచరులు, మద్దతుదారుల్లో ఈ పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement