హైదరాబాద్: తెలంగాణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు వినియోగించాలన్న కేఆర్‌ఎంబీ.. పునర్విభజన చట్ట ప్రకారమే నీటిని వినియోగించాలని స్పష్టం చేసింది.
కాగా, ఈ రోజు(శుక్రవారం, సెప్టెంబర్ 4వ తేదీ) హైదరాబాద్‌లోని జలసౌధ వేదికగా జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం అసంతృప్తిగానే ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ భేటీని అసంతృప్తిగానే ముగించాల్సి వచ్చింది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, తాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఇదీ చదవండి:
‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా దాటనివ్వం’


