జీడీ నెల్లూరు(చిత్తూరు జిల్లా): జీడీ నెల్లూరు జనసేన ఇన్‌చార్జ్ యుగంధరప్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు సొంత పార్టీ నేతలు. అక్రమాలకు పాల్పడుతూ స్థానికుల నుంచి నగదు వసూళ్లు చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో యుగంధర్‌పై జనసేన నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
పీఎమ్‌ఈజీపీ స్కీమ్ కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని యుగంధర్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సొంత పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. రూ. 10 లక్షల సబ్సిడి రుణాలు ఇప్పిస్తానని యుగంధర్ డబ్బులు వసూళ్లు చేసినట్లు ఫిర్యాదు చేశారు. పార్టీ సభ్యత్వం ఉన్న ఒక్కొక్కరి నుంచి రూ. 2,100 చొప్పున వసూలు చేశాడని, పార్టీ సభ్యత్వం లేని వారి నుంచి రూ. 20 వేల వరకూ తీసుకున్నట్లు జనసేన నేతల ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న యుగంధర్.. సబ్సీడీ దందా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు జనసేన మండల నేతలే కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. యుగంధర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. రాజకీయ పెద్దలతో పరిచయాలు, ఫోటోలు చూసి నమ్మించినట్లు ఫిర్యాదు దారుల ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆరు మండలాల్లో వందలాది మంది బాధితులున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


