సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని కార్మిక నేతలు మండిపడ్డారు. కేంద్రంతో కలిసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ సెక్యూరిటీని తొలగించడమే దీనికి ఉదాహరణ. అక్టోబర్‌లో 456 ప్లాట్లు అమ్మేందుకు టెండర్లు పిలవనున్నారు. దొడ్డిదారిన ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు’’ అంటూ కార్మిక నేతలు ధ్వజమెత్తారు.
ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌కు సీఐఎస్ఎఫ్ భద్రత తొలగించడం దారుణం. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? పోలవరం స్టీల్ ప్లాంట్ నాశనం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటున్నారు. సీఐఎస్ఎఫ్ తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మే హక్కు ఎవరిచ్చారు?’’ అంటూ చలసాని ప్రశ్నించారు.


