సాక్షి,తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్‌వి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం వల్ల దేశంలో వాతావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు.
Congratulations to @isro on the successful #GSLVF17 launch carrying #EOS05 from Sriharikota. I commend the scientists and engineers whose dedication and precision made this achievement possible. The mission strengthens weather monitoring, disaster management and national… https://t.co/PODbu2k2HQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026


