అన్ని జాతులను మోసం చేసిన నాయకుడు కేసీఆర్‌: బండి

Telangana BJP President Bandi Sanjay Fires on CM KCR - Sakshi

ఆదిలాబాద్‌: కేశ్లాపూర్ నాగోబా జాతరలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగదేవత అత్యంత శక్తిమంతమైన దేవత అన్నారు. హిందువుగా పుట్టడమే తన అదృష్టమని పేర్కొన్నారు.  గోండిలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన బండి సంజయ్..  సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. నాగోబా జాతరకు   వేల మంది  తరలి వస్తున్నా   ఏర్పాట్లు సరిగా చేయలేదన్నారు. నిజాం    శవానికి    అంత్యక్రియలు  చేయడానికి ఇస్తున్న ప్రాధాన్యత అదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎనిమిది  సంవత్సరాలలో   ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్  నాగోబా జాతరకు రాలేదని ధ్వజమెత్తారు.

'పోడు భూముల  సమస్య ఉంది. కుర్చీ వేసుకోని   పట్టాలు ఇస్తామన్నారు సీఎం. ఆ సంగతి  మర్చిపోయారు. పోటుగాడు సీఎం కేసీఆర్ పైసలు ఇస్తామని తండాలను పంచాయితీ చేశారు. కాని ఒక్కపైసా ఇవ్వలేదు. గ్రామపంచాయితీ నిదులు  దోంగిలించిన దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్ పేదలను ముంచుతున్నారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఇది లాస్ట్ అసెంబ్లీ. ఇచ్చిన హమీలను అసెంబ్లీ వేదికగా అమలు చేయాలి. అన్ని జాతులను ,వర్గాలను మోసం చేసిన నాయకుడు సీఎం.  టీఆర్‌ఎస్ బోర్డు తిప్పేసి బీఆర్‌ఎస్ మార్చారు.' అని బండి ఫైర్ అయ్యారు.

కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా బండి సంజయ్‌తో పాటు నాగోబా జాతరలో పాల్గొన్నారు. నాగోబా దేవతను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.  చందాలు వేసుకొని అద్భుతమైన  మందిరాన్ని నిర్మించారని కొనిడాడారు. జల్ ,జంగల్, జమీన్ హక్కులు కల్పించడంతో తెలంగాణ సర్కారు విపలైందని అర్జున్ ముండా ఆరోపించారు.  

'ఆదివాసీలకు జంగలే  దేవుడు. పట్టాలు ఇవ్వడం లేదు. కనీసం  కమ్యూనిటీ  హక్కులు   ఇవ్వడం లేదు. తెలంగాణ లో బీజేపీ అదికారంలో వస్తుంది. అదికారంలోకి రాగానే పట్టాలు ఇస్తాము. కొందరు అడవులను మింగేస్తున్నారు. ఆదివాసీల ప్రతి ఇంటికి త్రాగునీరు  అందిస్తాం. అదివాసీల కోసం కేశ్లాపూర్‌  దర్మశాల  నిర్మిస్తాం.' అని అర్జున్ ముండా అన్నారు.
చదవండి: డెక్కన్‌మాల్‌ ఘటన.. దొరకని మృతదేహాలు.. ఇక మిగిలింది బూడిదేనా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top