
Telangana Assembly Elections Today Minute To Minute Update
దుబ్బాకలో కేటీఆర్‌పై రఘునందన్ ఫైర్
- దుబ్బాకకు వచ్చి కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు
- వెయ్యి ఓట్లతో గెలిచానని అవమానించాడు
- నేను ఉద్యమం చేసి వచ్చా
- నువ్వెక్కడినుంచి వచ్చావ్
- కొత్త ప్రభాకర్‌రెడ్డికి దుబ్బాక టికెట్ ఎంతకు అమ్మావ్
- రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు
- శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు
కరీంనగర్‌లో కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
- కేటీఆర్.. నీకెంత కండకావరం? ఉద్యోగాలడిగితే… తిడతావా
- నిరుద్యోగ యువకులారా.. బీఆర్ఎస్‌ను ఓడించి గుణపాఠం చెప్పండి
- కేఏ పాల్ తమ్ముడు గంగుల
- గంగుల మనిద్దరి ఆస్తులను ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దమా?
హుస్నాబాద్‌లో పొన్నంపై హరీశ్‌రావు సెటైర్లు
- కోతల రాయుుడు వచ్చాడు ఒకాయన..మాటలు ఎక్కువ పని తక్కువ..
- కరీంనగర్ లో ఓడిపోయి ఇక్కడకు వచ్చాడు
- హుస్నాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం
- కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదు
- నేడు బంగారంలా రెండు పంటలు పండుతున్నాయి
- తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదు
- అందుకే కేంద్రం 35 వేల కోట్లు ఇవ్వలేదు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి రోడ్ షో
- బోరబండ ప్రాంతం ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేది
- అన్నా అంటే నేనున్నా అని పీజేఆర్ ఆనాడు మీకు అండగా ఉన్నారు
- ఇప్పుడు మీ కోసం కొట్లాడటానికి.. మీకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులున్నారు
- ఇక్కడ రౌడీ మూకలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారట.. జాగ్రత్త..వచ్చేది మా ప్రభుత్వం
- ఒక్కొక్కరి మక్కెలు విరుగుతాయ్.. రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది కాంగ్రెస్
- అందుకే హైదరాబాద్ నగర ప్రజలు శాంతి భద్రతల సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు
- బోరబండకు ఒక స్మశానవాటిక ఏర్పాటు చేయని సన్నాసులు.. మళ్లీ ఓట్లు అడగడానికి వస్తుండ్రు
- ఏ రాత్రి కష్టం వచ్చినా ఒక్క సీటీ కొట్టండి మీకు అండగా ఉండేందుకు వస్తా
- పదేళ్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు
- కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
- పక్క గల్లీకి వెళితే కుక్క కూడా గుర్తుపట్టని పక్క పార్టీ వ్యక్తి
- అజారుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చారని అంటారా?
- మోదీని ఎంత మంది గుర్తుపడతారో.. అజారుద్దీన్‌ను అంతే మంది గుర్తుపడతారు
కాంగ్రెస్ మిత్రపక్షాల సమన్వయ కమిటీ ఏర్పాటు
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కన్వీనర్‌గా కమిటీ
- కమిటీలో మిత్రపక్ష పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నాయకులకు స్థానం
- కాంగ్రెస్ నుంచి మల్లు రవి, కోదండ రెడ్డి సీపీఐ నుంచి చాడ వెంకట్ రెడ్డి, బాల మల్లేశం, ఈటీ నర్సింహ, టిజేఎస్ కోదండరాం, విశ్వేశ్వర్ రావ్, బక్రుద్దీన్‌లకు చోటు
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కామెంట్స్
- తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించబోతున్నారు
- తమిళనాడు,తెలంగాణకు పోలికలున్నాయి
- అక్కడాఇక్కడా అవినీతి, కుటుంబ పార్టీలు ఏలుతున్నాయి
- రెండు రాష్ట్రాల్లో విద్య, వైద్యం సహా అన్నిరంగాల్లో అభివృద్ధి కుంటుపడింది
- రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ లేవు
- రెండు రాష్ట్రప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని నమ్ముకున్నాయి
- తమిళనాడులో 18-60 మధ్య వయసున్న 90 శాతం మంది మగవాళ్లు మద్యానికి బానిసలయ్యారు
- తమిళనాడులో 9మంది మంత్రుల మీద అవినీతి కేసులున్నాయి
- తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు
- ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురుచూస్తున్నారు
- మోదీవైపు, బీజేపీ వైపు నిలుస్తారని నమ్మకం ఉంది
బీఆర్ఎస్ "స్కాంగ్రెస్ " ప్రకటనలపై కాంగ్రెస్ ఆగ్రహం
- బీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్
- ఈసీ అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా బీఆర్ఎస్ పత్రికా ప్రకటనలపై అభ్యంతరం
- ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తోంది : అభిషేక్ మను సింఘ్వి
- సీఈసీ బీఆర్ఎస్ ప్రకటనలపై చర్యలు తీసుకోవాలి
- బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నిలుపుదల చేయాలి
- తెలంగాణలో కుంభకోణాలకు పాల్పడింది కేసీఆరే
24న ప్రియాంక వరుస సభలు..
- తొర్రూరులో ప్రియాంక గాంధీ విజయభేరి సభ స్థలాన్ని పరిశీలించిన ఏఐసీసీ ప్రతినిధులు
- 24న ఉదయం 11 గంటలకు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రియాంక బహిరంగ సభ
- తర్వాత కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ, 4 గంటలకు ధర్మపురిలో బహిరంగ సభలో పాల్గొంటారు
మంథనిలో ఉద్రిక్తత
- పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ
- అంబేద్కర్ చౌరస్తాలో ఎదురెదురుగా తారసపడ్డ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రచార వాహనాలు
- దీంతో ఇరుపక్షాల పోటాపోటీ నినాదాలు..నెలకొన్న ఉద్రిక్తత
- ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
వివేక్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
- మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
- పది గంటలకుపైగా సోదాలు చేసిన ఐటీ అధికారులు
- రామగుండంలోని వివేక్ ఇంట్లో ఉదయం నుంచి జరిగిన ఐటీ రెయిడ్స్
- సోదాల తర్వాత బయటికి వచ్చిన వివేక్
- కార్యకర్తలకు అభివాదం
- నా మీద గెలవలేకే దాడులు
- సుమన్ నాపై ఫిర్యాదు చేశాడు
- ఓడిపోతున్నామనే భయంలోనే ఫిర్యాదు
సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీ చరిత్రను చూడాలి
- ఓటు వేసేటపుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
- రాయేదో రత్నమేదో గుర్తించాలి
- ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న వజజ్రాయుధం
- ఓటు రాబోయే 5 ఏళ్లలో మీ తలరాతను మారుస్తుంది
- బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం
- 15 ఏళ్లు రాజీలేని పోరాటం చేశాం
- కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది
- సూర్యాపేటకు నీళ్లు రాకుండా చేసిందే కాంగ్రెస్
- కరెంటు లేదు.. మంచి నీళ్లు లేవు..సాగు నీళ్లు లేవు
- పెన్షన్ రూ.5 వేలు చేస్తాం
- సూర్యాపేటలో ఒకప్పుడు పంట ఎంత..ఇప్పుడెంత
- నీటి పన్ను బకాయిలు రద్దు చేసి పన్నే లేకుండా చేశాం
- రైతుబంధు పథకాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం
- రైతు బీమా ఇచ్చాం
- రైతుబంధు ఎకరానికి 16 వేలు చేస్తాం
- కరెంటు 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నడు
- 10 హెచ్‌పీ మోటర్‌కు పైసలవెరివ్వాలె
- ధరణి తీసి బంగాళఖాతంలో వేస్తమని భట్టి విక్రమార్క చెప్తున్నడు
- ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్ల వస్తది
- మేం గెలిచిన తెల్లారే రోడ్డు మీద పండవెట్టి తొక్కుతమని రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతున్నడు
కేసీఆర్‌కు భట్టి విక్రమార్క కౌంటర్
- కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు
- ఇల్లు లేని వారికి ఇళ్లివ్వడం ఇందిరమ్మ రాజ్యం
- వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్‌లిచ్చింది ఇందిరమ్మ రాజ్యం
- అట్టడుగు వారిని పైకి తీసుకురావడమే ఇందిరమ్మ రాజ్యం
- పరిశ్రమలు, డ్యామ్‌లు నిర్మించడమే ఇందిరమ్మ రాజ్యం
- కేసీఆర్ తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థ తీసుకువచ్చారు
- కేసార్ అనే బండరాయిని రత్నం అనుకొని పదేళ్లు నెత్తిన పెట్టుకున్నారు
- 70పైన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు
- సీఎంగా ఉండి కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు
రుణమాఫీపై హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- 17 వేల కోట్ల రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బును ఇప్పటికే బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించింది
- మరో 2 వేల కోట్లు చెల్లిస్తే మిగతాది కూడా పూర్తవుతుంది.
- అయినా రుణమాఫీ కానివారెవరైనా ఉంటే తనకు దగ్గరకు రావాలంటూ రైతులకు భరోసా
- ఆ డబ్బు బ్యాంక్ కు తానే చెల్లించి రైతులను ఆదుకుంటానంటూ వ్యాఖ్యలు
- వీణవంక మండలం ఎలబాక ప్రచారంలో ఇంకా రుణమాఫీ కాలేదని అడిగిన ఓ రైతుకు సమాధానం
- అవసరమైతే తానే బ్యాంకుకు చెల్లిస్తానని హామీ
మల్కాజిగిరిలో నిర్మలా సీతారామన్ కామెంట్స్
- కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు ఎక్కడ నిలిపివేశామో చెప్పాలి
- దళితున్ని సీఎం చేస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారు
- కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే ఒక్క పైసా కూడా ఆపలేదు
- ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి లేదు
- పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు ప్రవేశపెడతాం
- కేసీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదు
- బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం
- బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారు
- పది లక్షలకు గాను.. 8లక్షల ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేసింది
- డిసెంబర్ లోపు మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేస్తాం
- మోటార్లకు మీటర్లు అనేది శుద్ధ అబద్ధం
డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రాలేదు
- డెమొక్రసీలో పరిణితి సాధించిన దేశాలే ముందుకు వెళ్తున్నాయి
- అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి పార్టీల వెనుక ఉన్న చరిత్రను పరిశీలించాలి
- రాయేదో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలి
- బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం
- కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు దేశాన్ని పరిపాలించింది
- బీఆర్‌ఎస్ మళ్లీ వస్తే పెన్షన్ 5 వేలు చేస్తాం
- వెన్నవరం కాలువకు నీళ్లిచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
- ధాన్యాన్ని ప్రభుత్వమే మొత్తం కొంటున్నది
- రైతుబంధు ఉండాలంటే రెడ్యానాయక్ గెలవాలి
- కరెంటు 24 గంటలుండాలంటే రెడ్యానాయక్ గెలవాలి
- పీసీసీ అధ్యక్షుడు 3 గంటల కరెంటు చాలంటున్నాడు
- రైతులకు 10హెచ్‌పీ మోటార్ ఎవరు కొనివ్వాలి
- డోర్నకల్‌లో 82 తండాలు గ్రామ పంచాయతీలయ్యాయి
- రెడ్యానాయక్‌కే ఓటు వేసి గెలిపించండి
దుబ్బాకలో కేటీఆర్ కామెంట్స్
- ఉప ఎన్నికలో రఘునందన్ అన్నీ దొంగమాటలు చెప్పాడు
- బీజేపీ నాయకులవి అన్ని లుచ్చా మాటలే
- రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క మాట అమలు చెయ్యలేదు
- దుబ్బాక ఎన్నిక దుబ్బాక దశ దిశ మార్చే ఎన్నిక
- కాంగ్రెస్ నాయకులు రేవంత్, కోమటిరెడ్డి కరెంట్ ఎక్కడ ఉందని మాట్లాడుతున్నారు
- రెండు బస్సులు పంపిస్తాం బస్సులో వెళ్లి కరెంట్ పట్టుకొని చూడండి అప్పుడు తెలుస్తుంది
- రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎద్దు, వ్యవసాయ తెలియని వక్తులు
- రాహుల్, రేవంత్‌కు తెలిసింది పబ్బులు, చింద్దులు వెయ్యడమే తెలుసు
- దుబ్బాక బీజేపీ అభ్యర్థికి టీవీలో కూర్చొని మాట్లాడడమే తెలుసు
- కాంగ్రెస్సోడు కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి చేశాడు
- దాడి నుంచి ప్రభాకర్ రెడ్డి బయట పడ్డాడు
- హరీష్ రావు, నేను ప్రభాకర్ రెడ్డికి అన్నదమ్ములుగా అండగా ఉంటాం
- దుబ్బాక ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం
వివేక్ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
- మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
- పది గంటల నుంచి కొనసాగుతున్న రెయిడ్స్
- సోదాలపై మండిపడుతున్నా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
- రివ్యూలో పాల్గొన్న డిప్యూటీ సీఈఓ సత్యవాణి, అడిషనల్ సీఈఓ సర్పరాజ్ పోలింగ్
- కౌంటింగ్, హోం ఓటింగ్, ఓటర్ స్లీప్ పంపిణి పై చర్చ
- సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకునే చర్యలపై పలు సూచనలు చేస్తున్న సీఈఓ
- ప్రచారం- నిబంధనలపై అధికారులకు దిశానిర్దేశం
వైరా ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం
- ఇంటింటికి పరిశుభ్రమైన మంచినీళ్లు అందిస్తున్నాం
- ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్
- 58 ఏళ్ల గోస తర్వాత పోరాడి తెలంగాణను సాధించుకున్నాం
- తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంటు,నీళ్లు లేవు
- పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది
- ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది
- 10 హెచ్‌పీ మోటర్ కొనాలంటే డబ్బులెవరివ్వాలి
- రైతులకు 3 గంటలే కరెంట్ చాలని పీసీసీ చీఫ్ చెప్తున్నాడు
- కాంగ్రెస్‌కు ఈసారి 20 సీట్ల కంటే ఎక్కువ రావు
- కాంగ్రెస్ వస్తే మళ్లీ ధర్నాలు,ఆందోళనలు చేయాల్సిన పరిస్థితే
- దళితుల్లో పేదరికం తొలగించేందుకే దళిత బంధు తీసుకువచ్చాం
వనపర్తిలో ప్రచార సభలో రేవంత్‌రెడ్డి కామెంట్స్
- తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
- పదేళ్లు కేసీఆర్‌కు అధికారమిచ్చారు
- ఆయన ఊడ్చుకుని తిన్నారు
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం
- తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని గుర్తుంచుకోండి
మధిర ప్రజా ఆశీర్వా ద సభలో కేసీఆర్ కామెంట్స్
- కాంగ్రెస్ గెలిచేది లేదు.. ముఖ్యమంత్రి అయ్యేది లేదు
- కాంగ్రెస్‌లో 20 మంది ముఖ్యమంత్రులు
- పదేళ్లలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది
- తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్
- కాంగ్రెస్ పాలన ఎలా ఉంది.. బీఆర్‌ఎస్ పాలన ఎలా ఉంది
- 50 ఏళ్ల కింద దళితబంధు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు
- భట్టి చుట్టపు చూపుగా మధిర వస్తాడు
- భట్టికి ఓటేస్తే ఒరిగేదేం లేదు
- దళితుల ఒక్క ఓటు కూడా కాంగ్రెస్‌కు పడొద్దు
- రైతు బంధు దండగని కాంగ్రెస్ నేతలంటున్నారు
- మూడు కోట్ల మందికిపైగా కంటి పరీక్షలు చేశాం
- కాంగ్రెస్ పాలనలో రాక్షస కోణం..బీఆర్‌ఎస్ పాలనలో మానవత్వం
- కాంగ్రెస్ చరిత్ర మోసాల మయం
- చింతకాని మండలంలో దళితుంలందరికీ దళితబంధు
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోంది: నిర్మలా సీతారామన్
- జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మధురానగర్‌లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్
- మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
- ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.
- బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు.
- చ్చిన హామీలను అమలు చేయలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి చేయలేదు.
- దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఎటు పోయింది?
బీజేపీ అధికారంలోకి వస్తేనే..: కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రం అధోగత పాలవుతుంది
- బీజేపీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్ ఉంటుంది
- బీఆర్‌ఎస్ డబ్బుతో కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది
- అవినీతి, ల్యాండ్ మాఫియా, కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి
అవినీతిలో బీఆర్‌ఎస్‌కు మెడల్ ఇవ్వొచ్చు: మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
- ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బ్యాక్ ర్యాలీ
- భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించి, రోడ్ షో నిర్వహించిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.
- రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్.
- తెలంగాణ భవిష్యత్తును నిర్థారించే ఎన్నికలు జరుగుతున్నాయి: ఫడ్నవీస్.
- బీఆర్‌ఎస్ అంటే అవినీతి కుటుంబ పాలన సమితిగా మారింది.
- కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు.
- అవినీతికి నిదర్శనంగా మేడిగడ్డ బ్యారేజ్ నిలుస్తుంది.
- బ్యాక్ వాటర్‌లో గడ్చిరోలి జిల్లాలో పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.
- ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి మా ప్రాంతానికి ముంపుకు గురి చేసి ఆందోళనకు గురి చేస్తున్నారు.
- తెలంగాణలో ఏమో వెలగబెట్టినట్లుబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్రకు వస్తున్నారు.
- తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయింది. వారి దుకాణం బంద్ అవుతుంది.
- మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు స్థానం లేదు.
- ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- మీకు మోదీ సర్కార్ అండగా ఉంటుంది.
- బీజేపీతోనే అందరికి న్యాయం, మేలు జరుగుతుంది
రెండు రోజులు తెలంగాణలో మాయవతి పర్యటన
- ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పాటు తెలంగాణ లో పర్యటించనున్న మాయావతి.
- మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు.
- అనంతరం సూర్యాపేట బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
- రేపు పెద్దపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న మాయావతి.
- తాజ్ కృష్ణలో బస చేయనున్న మాయావతి..
నేడు సీఈఓ వికాస్ రాజ్ సమీక్ష
- మధ్యాహ్నం 3గంటలకు జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న సీఈఓ వికాస్ రాజ్
- పోలింగ్, కౌంటింగ్, హోం ఓటింగ్, ఓటర్ స్లీప్ పంపిణీపై చర్చ
- సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకునే చర్యలపై పలు సూచనలు చేయనున్న సీఈఓ
- ప్రచారం-నిబంధనలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్న వికాస్ రాజ్
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం
- ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత ,మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం.
- పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన థాక్రే .
- హాజరైన ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, ఎన్నికల పరిశీలకులు బోసురాజు, విహెచ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు..
- 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వెళ్ళతో పెకిలించాల్సిన సమయం వచ్చింది: మృత్యుంజయం.
- ఎన్నికల తరువాత ఒకరోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండడానికి లేదు.
- ప్రజలు బీఆరా్‌ఎస్‌ను చీత్కరిస్తున్నారు..
- తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి..
- కేసీఆర్ తెలంగాణ ద్రోహి.
- హామీల నెరవేర్చకుండా అవినీతి సామ్రాట్ అయ్యారు..
- దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అవినీతి కేసీఆర్ చేశారు.
- రెండున్నర సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నా..
- మోదీ ,అమిత్ షా కేసీఆర్ అవినీతి గురించి చెప్తారు.. కానీ చర్యలు తీసుకోరు.
- వారికి వ్యతిరేకంగా ఉన్నా కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ రైడ్స్ చేసున్నారు.
- రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..
- బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు ఒకటే.. వాటిని కులగొట్టేది కాంగ్రెస్ మాత్రమే..
సోనియా, ఇందిరా గాంధీని విమర్శిస్తే సహించేది లేదు: వీహెచ్
- నిన్నటి వరకు కేసీఆర్ సోనియా, కాంగ్రెస్‌ను మాత్రమే తిట్టేవారు.
- ఇప్పుడు గరీబ్ హటావో అని పేదలను ఆదుకున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆకలి చావులు అని తిడుతున్నాడు.
- ఇందిరా గాంధీని విమర్శిస్తే తెలంగాణ లో ఏ ఒక్క మహిళా మీకు ఓటేయరు.
- మీకు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఇందిరా గాంధీ ని విమర్శిస్తున్నారు...
- ఇందిరా గాంధీ ని విమర్శిస్తే బీఆర్‌ఎస్‌పైన తిరగబడబడాలని తెలంగాణ మహిళలకు విజ్ఞప్తి చేస్తా.
- కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు రేపటి నుంచి 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నా.
- రేపు నల్లగొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ
- హాజరుకానున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
- బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఇంట్లోనూ ఐటీ, ఈడీ దాడులు
- బంజారాహిల్స్‌లోని వినోద్ నివాసంలో తనిఖీలు
- వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లోనూ ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి
బీజేపీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు ఉంటుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది.
- బీజేపీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
- కాంగ్రెస్ బీఆర్ఎస్ డబ్బుతో గెలువాలని చూస్తున్నాయి.
- ఆ రెండు పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్‌కు, వేసినా బీఆర్‌ఎస్‌కు వేసినట్లే
- ఆ రెండు పార్టీల్లో ఏ ఒక్కరికీ ఓటు వేసిన ఎంఐఎంకు వేసినట్టే.
- అవినీతి, ల్యాండ్ మాఫియా, కుటుంబ పాలన పోవాలంటే బీజేపీని గెలిపించాలి.
కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే: పొంగులేటి
- భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ చర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం.
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కామెంట్స్..
- ధర్మానికి, అధర్మానికి మద్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు..
- రాష్ట్రంలో కాంగ్రెస్ 76 నుంచి 80 సీట్లు గెలిచి అధికారంలోకి రావడం ఖాయం.
- అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం.
- కర్నాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీలలో 4 హామీలను అమలు చేశారు.
- బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు గ్లోబల్ ప్రచారం చేస్తుంది.
- కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా అని అడుగుతున్నారు.
- రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది.
- డబుల్ బెడరూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.
- ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యను గెలిపించాలి.
కాంగ్రెస్ నేత వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు...
- కంపెనీ కార్యాలయాలపై కొనసాగుతున్న ఈడీ సోదాలు.
- చెన్నూరు, హైదరాబాద్‌లలో కొనసాగుతున్న ఈడీ సోదాలు..
- బంజారాహిల్స్, సోమాజిగూడ, చెన్నూరులో కొనసాగుతున్న ఈడీ సోదాలు.
- కేంద్ర బలగాలతో సోదాలు చేస్తున్న ఈడీ.
- ఇటీవల 8 కోట్లు పట్టుబడిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ.
- భారీ ఆన్‌లైన్ బ్యాంకు ట్రాన్సక్షన్స్ గుర్తించిన ఈడీ.
- హైదరాబాద్‌ల్‌లో రూ.8 కోట్లు RTGS ద్వారా బదిలీని గుర్తించిన ఈడీ.
- విశాఖ ఇండస్ట్రీస్ PVT HDFC బేగంపేట్ ఖాతా నుంచి బదిలీ చేయబడిన 8కోట్లను స్థంబింపచేసిన సైఫాబాద్ పోలీసులు .
- విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ IDBI బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్ ఖాతాకు నగదు బదిలీ అయినట్టు గుర్తింపు.
- ఈనెల 13 ఉదయం 10.57 గంటలకు లావాదేవీ జరిగినట్లు గుర్తింపు.
- ఐటీశాఖకు ఈడీకి భారీ మొత్తంలో లావాదేవీలపై సమాచారం ఇచ్చిన పోలీసులు.
- ఆయా కంపెనీలపై చట్టపరమైన చర్యలకు దర్యాప్తు ముమ్మరం చేసిన ఐటీ, ఈడీ
- ఉదయం ఐదు గంటల నుంచి సోదాలు చేస్తున్న ఈడీ
- సోమాజిగూడ వివేక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెళ్లిపోయిన ఈడీ అధికారులు. ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
సోమాజిగూడలోని వివేక్ నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు
- నాలుగున్నర గంటలు పాటు సోదాలు చేసిన ఐటీ
- ఈ నెల 13 తేదీన ఫ్రీజ్ చేసిన 8 కోట్లు రూపాయలు పై ఆరా తీసిన ఐటీ
- మంచిర్యాల లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతల క్యూ
- ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచార పర్వం.
- నేటి నుంచి 28 దాకా సభలు, రోడ్‌షోలు.
- మోదీ, అమిత్ షా, నడ్డా, నిర్మల, రాజ్‌నాథ్ తదితరుల పర్యటనలు.
- 25, 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ నియోజకవర్గాల పరిధిలో విస్తృత పర్యటనలు, రోడ్‌షోలు.
నేడు ఖమ్మం జిల్లాకు గులాబీ దళపతి కేసీఆర్
- మధిర, వైరా లో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు
- ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ముగియనున్న సీఎం కేసీఆర్ సభలు.
- అక్టోబర్ 27న పాలేరు నియోజకవర్గం లో తొలి ప్రజా ఆశీర్వాద సభ.
- సత్తుపల్లి, ఇల్లందు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక సభలు జరిగాయి.
- పినపాక నియోజకవర్గంతో పాటు భద్రాచలం నియోజకవర్గాలు కలిపి సభ నిర్వహించారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటితో పది నియోజకవర్గాలలో ముగియునున్న సీఎం కేసీఆర్ సభలు.
- 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటిఆర్ ఖమ్మం రోడ్ షో.
- 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిరలో ప్రియాంక గాంధీ రోడ్ షో
24, 25, 27 తేదీల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారం
- మారోమారు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ
- ఈ నెల 24, 25, 27 తేదీల్లో ఆమె రాష్ట్రంలో పర్యటిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడి
- ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
- 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర
- 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభలకు హాజరు
- ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రియాంక ఈ వారంలోనే మూడు రోజులపాటు ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.
నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
- వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
- మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి బహిరంగసభ.
- మధ్యాహ్నాం 2 గంటలకు నాగర్ కర్నూల్ బహిరంగసభ.
- మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేట బహిరంగసభ.
- సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ షోలో పాల్గొననున్న రేవంత్.
కామారెడ్డిలో రాజకీయ కాక
- కామారెడ్డి జిల్లాకు ఈ వారంలో అగ్రనేతల రాక.
- 25న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ సభ.. ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు.
- 24న జుక్కల్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ రోడ్ షో సభ.
- అదే రోజు కామారెడ్డిలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ రేవంత్ రెడ్డిల రోడ్ షో.
- కామారెడ్డిలో రెండ్రోజుల పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో.
- జుక్కల్ నియోజకవర్గంలో హరీష్ రావు సభ .
- 24న జుక్కల్ నియోజక వర్గం పిట్లంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ సభ
- రోడ్ షోలు బహిరంగ సభలు కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తనున్న ప్రచారం.
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు
- హైదరాబాద్, మంచిర్యాలలోని వివేక్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు
- తెల్లవారుజామున ఐదున్నర నుంచి కొనసాగుతున్న సోదాలు
- చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ పోటీ
చాన్స్ ఉన్న చోట్ల ప్రచార హోరు
- రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతల క్యూ
- నేటి నుంచి 28 దాకా సభలు, రోడ్‌షోలు
- మోదీ, అమిత్ షా, నడ్డా, నిర్మల, రాజ్‌నాథ్ తదితరుల పర్యటనలు
27 నియోజకవర్గాలకు ఏఐసీసీ అదనపు పరిశీలకులు
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 27 నియోజకవర్గాలకు ఏఐసీసీ అదనపు అసెంబ్లీ పరిశీలకులు
- ఒక కమ్యూనికేషన్ పరిశీలకుడిని నియమించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
♦జూబ్లీహిల్స్
♦ఎల్బీనగర్
♦జుక్కల్
♦భద్రాచలం
♦ఖైరతాబాద్
♦కామారెడ్డి
♦స్టేషన్ ఘన్‌పూర్
♦గద్వాల్
♦మహబూబాబాద్
♦సనత్‌నగర్
♦నాంపల్లి
♦సంగారెడ్డి
♦కొడంగల్
♦జనగాం
♦కల్వకుర్తి
♦భువనగిరి
♦హుస్నాబాద్
♦సికింద్రాబాద్ కంటోన్మెంట్
♦డోర్నకల్
♦తుంగతుర్తి
♦పాలకుర్తి
♦అంబర్‌పేట
♦వరంగల్ వెస్ట్
♦నాగార్జునసాగర్
♦రాజేంద్రనగర్
♦మల్కాజ్‌గిరి అచ్చంపేట
24, 25, 27 తేదీల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారం
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మరో మారు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం
- ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
- 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర
- 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ప్రచారసభలకు హాజరు
- ఈ నెల 28న ముగియనున్న ఎన్నికల ప్రచారం