
Telangana Assembly Elections Today Minute To Minute Updates
నేను ఏనాడు భూ కబ్జాలు చేయలేదు.. అవినీతి చేయలేదు: బండి సంజయ్
- కరీంనగర్‌లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం
- గంగుల కమలాకర్, పురుమళ్ల శ్రీను ఇద్దరూ నయీం బ్రదర్స్.
- వీరిద్దరూ భూమి కనపడితే చాలు కబ్జా చేస్తారు.
- నేను ఏనాడు భూ కబ్జాలు చేయలేదు. అవినీతి చేయలేదు.
- నేను గెలుస్తున్న అన్న సర్వే అంచనాలతో గంగుల కుట్రకి తెరలేపుతున్నారు.
- నాపై ఫేక్ వీడియోలు సిద్దం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు.
ఏ పనిచేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి?: ఎమ్మెల్సీ కవిత
- పెద్దపల్లి జిల్లా మంథని ఎన్నికల సభల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్.
- సింగరేణిని కాంగ్రెస్ నాశనం చేస్తే కాపాడింది సీఎం కేసీఆర్.
- సంస్థను అప్పులపాలు చేసి కేంద్రానికి 49 శాతం కుదువపెట్టింది కాంగ్రెస్.
- కాంగ్రెస్ వాళ్లకు సింగరేణిపై ప్రేమ లేదు.
- సంస్థను ఎవరికో తాకట్టు పెట్టాలన్నదే కాంగ్రెస్ తాపత్రయం.
- పీవీని కాంగ్రెస్ అవమానించింది.. బీఆర్ఎస్ గౌరవించింది.
- ఏ పనిచేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి.
- మధు గెలిస్తే సీఎం నియోజకవర్గం తరహాలో మంథని అభివృద్ధి.
రేపటి రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్
- సోమవారం నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
- నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్.
- మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్ బహిరంగసభ.
- మధ్యాహ్నం 3 గంటలకు పరకాల బహిరంగసభ.
- సాయంత్రం 6 గబటలకు ఖైరతాబాద్ రోడ్ షో.
- రాత్రి 8 గంటలకు నాంపల్లి రోడ్ షోలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం
- మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్లగొండలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం.
- గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటన.
- మధ్యాహ్నం 1 గంటలకు గజ్వేల్ రోడ్ షో
- మధ్యాహ్నం 2 గంటలకు విశ్వబ్రాహ్మణ మీటింగ్, వైష్ణవి గార్డెన్స్.
- మధ్యాహ్నం 3 గంటలకు వర్గల్ రోడ్ షో.
- మధ్యాహ్నం 4 గంటలకు ములుగు రోడ్ షో.
తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు: రేవంత్ రెడ్డి.
- తెలంగాణప్రజలు ఆకలినైనా భరిస్తారు.కానీ అవమానాన్ని భరించరు.
- తెలంగాణ ప్రజలను కేసీఆర్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు.
- తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు.
- నిజాంకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది.
- అభివృద్ధి వెనక అవినీతి ఉంది.
- ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
- కాంగ్రెస్ రావాలని ప్రజల ఆలోచన.
కాంగ్రెస్ కొత్త సీసాలో పాత సరుకు: కేటీఆర్
- అశ్వారావుపేట రోడ్ షో లో కేటీఆర్ కామెంట్స్
- కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
- నాడు కనీసం 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు..
- రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు?
- 10హెచ్‌పీ మోటార్లు ఏ రైతుకు వున్నాయి?..
- కాంగ్రెస్ వాళ్లకి రెండు బస్సులు పెట్టిస్తా, ఏ ఊరికి వెళ్లి కరెంట్ వైర్లు పట్టుకున్నా సిద్ధమే.. దరిద్రం వదిలిపోతుంది..
- రైతుల కళ్ళలో కన్నీరు మిగిల్చిన కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి.
- మన ప్రభుత్వం రాగానే గ్యాస్ ధర 400 చేస్తాం..
- తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం ఇస్తాం..
- డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఇంటికి 5లక్షల ప్రమాద భీమా ఇస్తాం.
- అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తాం..
- అశ్వరావుపేట ని మున్సిపాలిటీ చేస్తాం..
- రాష్ట్రం మొత్తం గులాబీ గాలి వీస్తుంది.
- ఎవడోచ్చి సంచులు చూపించిన మళ్ళీ గెలిచేది కేసీఆర్
- ఆయిల్ పామ్ ధరలు మద్దతు ధర ఇస్తాం.
- ఎవరి మాయ మాటలు నమ్మద్దు..
- కాంగ్రెస్ కొత్త సీసాలో పాత సరుకు..
- వాళ్ల డబ్బు సంచులు చూసి బయపడద్ధు..
- కారు గుర్తుకు ఓటేసి మెచ్చాని గెలిపించి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం.
మంచిర్యాలలో ఈటల రాజేందర్ కామెంట్స్
- సింగరేణిలో నిరుద్యోగులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టింది కేసీఆర్
- సింగరేణిలో 63 వేల మంది కార్మికులు ఉండగా 40 వేల మంది కార్మికులను మోసం చేశాడు
- తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేటుపరం చేసింది కేసీఆరే
- తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు
- ప్రధానమంత్రి మోదీ చాయ్ అమ్మాడు..ఆయన తల్లి ఇళ్లలో పనిచేసేది
- మోదీ కష్టాన్ని,ధైర్యాన్ని, ధర్మాన్ని నమ్ముకొనే దేశ ప్రధానమంత్రి అయ్యాడు
- నేటికీ సింగరేణిలో ఎన్నికలు జరిపించలేదు.
- నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో మంచిర్యాల చెన్నూరు, బెల్లంపల్లిలో ఒక్క ఓటు పడదు కేసీఆర్
- బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటాల్ ధాన్యానికి రూ.3100 మద్దతు ధర ఇస్తాం
నారాయణఖేడ్‌లో బండి సంజయ్ కామెంట్స్
- 3 ఎకరాల ‘సామాన్యుడి’కి.. 3వేల ఎకరాల ఆసామికి మధ్య యుద్దం
- ఆ గట్టునుంటారా? ఈ గట్టున ఉంటారా? తేల్చుకోండి
- ఎవరూ భయపడాల్సిన పనిలేదు… మీ వెనుక మేమున్నాం
- ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన
- కేసీఆర్ పై కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టారు.. అయినా డోన్ట్ కేర్
- ఒవైసీకి సవాల్ చేసి పాతబస్తీలో సభ సక్సెస్ చేసి సత్తా చాటినం
- 12 శాతం ఓట్లకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నరు
- 80 శాతమున్న నారాయణ్ ఖేడ్ హిందూ ఓట్లన్నీ ఏకమైతే సంగప్ప గెలవడా?
- కేసీఆర్ అయోధ్యలో రాముడు జన్మించాడా? లేదా? చెప్పు
- పొరపాటున కేసీఆర్ కు అవకాశమిస్తే… రాముడు అయోధ్యలోనే పుట్టలేదంటాడు?
- ఖేడ్ లో 70 ఏళ్ల కుటుంబ పాలనను బద్దలు కొట్టండి
- సంగప్పను గెలిపిస్తే నారాయణఖేడ్ సస్యశ్యామలం చేస్తాం
కొత్తగూడెం కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ కామెంట్స్
- తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచడంలో ముందున్నది కొత్తగూడెం సింగరేణి ప్రాంతం
- సింగరేణిని మింగేయాలని మోదీ అనుకుంటున్నాడు
- సింగరేణిని కాపాడుకోవాలి అంటే గులాబీ జెండా వల్లే అవుతుంది
- కొత్తగూడెంకు విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నిస్తే మోదీ అడ్డుకున్నారు
- ఇక్కడి కార్యకర్తల జోష్ చూస్తుంటే మళ్ళీ వనమా గెలుపు ఖాయం అనిపిస్తుంది
- సింగరేణి బతకాలంటే కేసీఆర్ రావాలి వనమా గెలవాలి
- కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు వనమా గెలుపు కోసం కృషి చేయాలి
కొల్లాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- ప్రజల దగ్గర ఉన్న ఆయుధం ఓటు
- ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి
- ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి
- అభ్యర్థి గుణగణాలతో పాటు పార్టీ చరిత్రను చూడాలి
- తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్ పుట్టింది
- పదేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చించాలి
- ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణకు వెనుకబడిన ప్రాంతమని పేరుపెట్టారు
- పదేళ్ల క్రితం వరకు నీళ్లు రావు, వరిపండదని మాట్లాడారు
- ఇది మన బతుకు,తలరాతను మార్చేఓటు
- మళ్లీ తెలంగాణను ఆగం చేసేందుకు రాహుల్ వస్తున్నారా
- 9 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డామో చూశాం
- మహబూబ్‌నగర్‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశాం
- నేను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాం
- రైతులు పండించే పంటను మొత్తం కొంటున్నాం
- రైతుబంధు వచ్చే ఏడాది నుంచి పెంచుతాం
ఈనెల 30 తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ ఉండదు: భట్టి విక్రమార్క
- నేనిక్కడే ఉంటాను.. నాకు ఓటేయ్యండి అని బీఆర్‌ఎస్ అభ్యర్థి అంటున్నారు.
- బీఆర్‌ఎస్ పార్టీనే ఉండటం లేదు. ఇక ఆ పార్టీ అభ్యర్థి ఎక్కడ ఉంటాడు.
- పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు.
- రోడ్డేసింది కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్.
- రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ ఇచ్చింది కాంగ్రెస్.
- అభివృద్ధి చేయని బీఆర్‌ఎస్ వద్దు, కాంగ్రెస్ రాబోతుంది.
- సంపదను పేదలకు పంచబోతున్నాం
వృద్ధులకు కాశీ, అయోధ్యకు ఉచిత ప్రయాణం: జేపీ నడ్డా
- వేలాది మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది కానీ ప్రజలు అభివృద్ధి చెందలేదు కేవలం కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది
- కుటుంబ పాలన, ప్రజల మధ్య పోటీ ఇది.
- బిహార్, హరియణ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ.. ఇలా కుటుంబ పాలన నడుస్తుంది.
- వీటితో బీజేపీ పార్టీ పోరాడుతుంది
- మిత్రులారా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం డబ్బులు పంపిస్తే ఇక్కడ కేవలం కమిషన్‌ల కోసం పనిచేస్తుంది.
- భారాస అంటే భ్రష్టచర్య రాష్ట్ర సర్కారు ఇది తెలంగాణ ప్రజలను లూటీ చేస్తుంది.
- కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఎటిఎం లాంటిది దీనికి 38 వేల కోట్లు ఖర్చు అవుతోంది కానీ లక్ష కోట్లు పైగా ఖర్చు పెట్టి దోచుకుంది.
- కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడుతాం.
- అన్నింటిలో 30 శాతం తీసికునే సర్కార్ పోవాలి.బీజేపీ పాలన రావాలి.
- మోదీ పాలనలో దేశం ముందుకు వెళ్తుంది.
- 2024లో మోదీ అధికారంలోకి వస్తే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా మారుతుంది.
- మరో ఐదు సంవత్సరాలు తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తాం.
- కర్ణాటక ప్రజలను అడుగుతున్న 5 గ్యారెంటీలు అమలవుతున్నయా?
- చేయి గుర్తు అంటే ఏమి చెయ్యమని అర్థం
- కర్ణాటకలో కరెంట్ లేక చీకట్లు ఉన్నాయి ఇక్కడ కూడా అది కావాలా ఆలోచించాలి.
- మేము గెలిస్తే మహిళలకు ప్రతి సంవత్సరం నాలుగు ఉచిత సిలిండర్లు అందిస్తాం.
- నిరుద్యోగులకు కోసం వచ్చే ఐదు సంవత్సరాలలో 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
- సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తాం.
- రాష్ట్రంలో అధికారంలో వస్తే 10 లక్షల ఆరోగ్య భీమా.
- కమలం పువ్వు కు ఓటు వేసి గెలిపించాలి
ఆసిఫాబాద్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
- సత్యం కోసం, స్వాభిమానం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు.
- 40 ఏళ్ల తర్వాత కూడా ఇందిరా గాంధీ మీకు గుర్తున్నారు.
- ప్రతిక్షణం ప్రజల బాగోగుల గురించి ఆలోచించేవారు
- తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్న సమంలోనే ఇందిరాగాంధీ చనిపోయారు
- మీ భూములపై హక్కులను ఇందిరాగాంధీ కల్పించారు
- జల్, జమీన్, జంగల్‌పై ఆదివాసులకు హక్కు ఉంటుందని ఇందిరా భావించారు.
- తెలంగాణ ఉద్యమాన్ని సోనియా గాంధీ అర్థం చేసుకున్నారు.
- ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.
- తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతోంది
- బీఆర్‌ఎస్ పాలనలో మీ స్వప్నం నెరవేరిందా?
- బీఆర్‌ఎస్ పాలనలో మీ పిల్లలు బాగుపడుతారనే నమ్మకం ఉందా?
- కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేశారు
- రాజస్థాన్‌లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది
- మరో లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు.
- బీఆర్‌ఎస్‌పై పెట్టుకున్న ఆశలు ఒక్కటి నెరవేరలేదు
- నిరుద్యోగ భృతి ఇచ్చారా?
- ఉద్యోగాలు ఇచ్చారా.. భూములు ఇచ్చారా
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకులు అవుతున్నాయి. స్కామ్‌లు జరుగుతున్నాయి.
- పరీక్షల సమయంలో విద్యార్థులు ఎంత కష్టపడ్డారో తెలుసు.
- రాజస్థాన్‌లో మాదిరిగా తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.
- అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం.
- రైతులకు కనీస మద్దతు ఇస్తాం.
- ధాన్యానికి రూ. 1500 మద్దతు ధర ఇస్తాం
- చెరుకుకు 4 వేలు పత్తికి, 6700 మద్దతు ధర ఇస్తాం
- రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుదాం
- కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షక్లో కుంభకోణం జరిగింది.
- ప్రభుత్వం దోచుకున్న ఆ సొమ్ము అంతా ప్రజలదే.
- భూమి, ఇసుక, లిక్కర్, స్కాముల్లో డబ్బంతా ప్రజలదే.
అలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- కేంద్రం మెడలు వంచైనా సరే బోయలకు న్యాయం చేస్తాం
- 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండె..ఇప్పుడెలా ఉంది
- కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసింది
- అలంపూర్‌కు అవసరమైన తాగునీరు ఇస్తాం
- అలంపూర్‌కు కరువు అనేది లేకుండా చేస్తాం
- ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు జాగ్రత్తగా వాడాలి
- ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దు
- పార్టీల చరిత్రను చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
ప్రియాంక గాంధీ సీరియస్ కామెంట్స్
►ప్రియాంక ఖానాపూర్‌లో ఎన్నికల ప్రచారం
►కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను లూటీ చేశారు.
►ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ఇందిరా గాంధీ రాజకీయాలు చేశారు.
►నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది.
►తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోంది.
►లిక్కర్ స్కాం, ల్యాండ్ మైనింగ్ మాఫియా రాజ్యం నడుస్తోంది.
►కర్ణాటకలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామో.. తెలంగాణలో కూడా అదే విధంగా అమలవుతాయి.
►ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు.
►కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది.
►అధికారంలోకి రాగానే క్యాలెండర్‌ను అముల చేస్తాం.
►మోదీ కార్పొరేట్ల రుణాలను మాఫీ చేశారు.
►రైతులకు రుణాలు మాఫీ చేయలేదు.
►కేసీఆర్ తప్పులను బీజేపీ ప్రశ్నించడం లేదు.
►ధరణి పోర్టల్‌లో చాలా తప్పులు ఉన్నాయి.
►కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం.
►రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.
రేవంత్ కీలక వ్యాఖ్యలు..
►తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుంది.
►నిజాం నిరంకుశ పాలన.. సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం..
►తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమి..
►తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు.
►అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది..
►సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదు.
►ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు.
►అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారు.
►కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం.
►తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారు..
►పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదు.
►అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది.
►నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారు.
►తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిచేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించాం
►ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్ ను ప్రజల ముందుంచాం
►తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలి.
►ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ ను గద్దె దించాలి.
►తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి.
►ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం..
►ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు.
►గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సీఎంగా ప్రజా దర్బార్ ను నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
►ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్దరిస్తాం.
►కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదు. ఆయన రాచరికం అనుకుంటున్నారు..
►2వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు.
►కేసీఆర్ ఇచ్చే పెన్షన్ కంటే కర్ణాటకలో పెన్షన్ తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోంది.
►కేసీఆర్ సవాల్ లో పస లేదు.
►బలహీనవర్గాలు కేసీఆర్ ను ఓడించాలన్న కసితో ఉన్నారు..
►ఆ ఓట్లను చీల్చి కేసీఆర్ కు సహకరించడమే బీజేపీ వ్యూహం.
►ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు.. ఇప్పటికీ అతీగతి లేదు..
►బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు?
►దళితుల ఓట్లు కాంగ్రెస్ కు రాకుండ చీల్చేందుకే కమీటీతో కాలయాపన
►24 గంటల కరెంటుపై ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం...
►కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం.
►ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది..
►హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయి..
►అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుంది.
►కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు.
తన కుటుంబం గురించి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్..
►మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను.
►ప్రజా జీవితంలో ఉండటం వల్ల నాన్న కేసీఆర్ ప్రభావం నాపై చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఉండేది.
►నా చెల్లి కవిత చాలా డైనమిక్.. ధైర్యవంతురాలు.
►నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుంది.
►నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది.
►కూతురు పుట్టాక నా జీవితం చాలా మారింది.
►హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
►కోవిడ్ సమయంలో సుచిత్రా ఎల్లా, మహిమా దాట్ల వంటి వారు గొప్పగా నిలిచారు.
►మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారు.
►ప్రతీ ఇంటికీ నీళ్లు అందించాం. మైనార్టీ పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాం.
►ప్రతీ చిన్నారిపై రూ.10వేలు ఖర్చు చేస్తున్నాం.
►ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 61 శాతానికి పెరిగాయి.
►స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం.
►మేము మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్నింటిని పూర్తి చేసాము ఇంకా చేయాల్సిన ఉన్నాయి.
►మహిళా యూనివర్సిటీ , కల్యాణ లక్ష్మీ , అమ్మఒడి సేవలు వంటివి తెచ్చాం.
►మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్ ఇస్తాం.
►మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ లైన్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నాం.
►మహిళలు తమ వివరాలు చెప్పకుండానే కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవచ్చు, మెంటల్ హెల్త్ సహాయం అందిస్తారు.
►రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు.. రావాలి కూడా.
►రక్షణ పరంగా ఇప్పటికే షీ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ లాంటివి తీసుకొచ్చాం.
కేసీఆర్, గంగులపై బండి సంజయ్ ఫైర్
►కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
►బావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్
►గంగుల కమలాకర్, కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్
►డాక్యుమెంట్లతో రా.. నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమంటూ సవాల్
►నీ ఆస్తిపాస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు పంచే దమ్ముందా?
►రేషన్ మంత్రివి నువ్వు కదా.. మరి ఇన్నాళ్లు రేషన్ కార్డులెందుకివ్వలేదు?
►ఆ ఫోన్లు తీసుకోండి.. మోదీ ఫొటోను డీపీగా పెట్టుకోండి
►కుటుంబానికి దూరమై ప్రజల కోసం కొట్లాడితే.. కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులు
►గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతా
►ఎమ్మెల్యే కాగానే ఎవడు అడ్డమొచ్చినా గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహించి తీరుతా
►మళ్లీ కేసీఆర్, గంగుల అధికారంలోకి వస్తే ప్రజలంతా బిచ్చమెత్తుకోవాల్సిందే.
పదవులు కాదు.. తెలంగాణ అభివృద్ధే ముఖ్యం: కోదండరాం
►గోదావరిఖనిలో ఎన్నికల ప్రచారంలో ప్రొఫెసర్ కోదండరాం
►కోదండరాం కామెంట్స్..
►ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి.
►మాకు( తెలంగాణ ఉద్యమకారులకు ) పదవులు, కీర్తి, కిరీటాలు కాదు తెలంగాణ అభివృద్ధి మాత్రమే.
►తెలంగాణ తెచ్చుకోవడం కోసం కొట్లాట, తెలంగాణ వచ్చాక అభివృద్ధి కోసం పోరాటం అనేది ప్రొఫెసర్ జయశంకర్ ఆశయం.
►రామగుండం ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉండే ప్రాంతం అని జయశంకర్ ఉన్న సమయంలోనే కేసీఆర్‌తో సహా నిపుణులు ఖరారు చేశారు.
►ఓసీపీ గనులు వద్దు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలనేది మా ప్రపోజల్.
►కేసీఆర్ సీఎం అయ్యాక ఇక్కడి అభివృద్ధిని మర్చిపోయి, ఇక్కడి వనరులను కొల్లగొడుతున్నారు.
►ఆఖరికి బూడిద కూడా ఇక్కడి ఎమ్మెల్యే కి ఒక "వరదాయిని"లా మారింది.
►ఇక్కడి నాయకులకు లాభాలు కానీ.. ఇక్కడి ప్రజలకు మాత్రం మిగిలింది బూడిద మాత్రమే.
►ఆఖరికి ఆర్.ఎఫ్.సి.ఎల్ కూడా స్థానిక ఎమ్మెల్యేకి లాభం చేకూరేలా మారింది.
►ఆర్.ఎఫ్.సి.ఎల్ బాధితులపై చేసిన విధానానికి ఎమ్మెల్యేపై కేసు పెట్టాలి.
►ఆర్.ఎఫ్.సి.ఎల్ కి ముఖ్య కారణం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి.
బీఆర్‌ఎస్ చేరిన ఉదయ్ బాబుమోహన్
►మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన బాబుమోహన్ కుమారుడు ఉదయ్
►ఉదయ్‌తోపాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు.
►వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీశ్.
►తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని హరీశ్ కామెంట్స్.
బాబుమోహన్‌కు షాక్.. సంగారెడ్డిలో పొలిటికల్ హీట్..
►బీఆర్‌ఎస్‌లో చేరుతున్న బాబుమోహన్ కుమారుడు ఉదయ్ బాబుమోహన్
►నేడు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
►ఎన్నికల్లో ఆందోల్ బీజేపీ అభ్యర్థిగా బాబుమోహన్
►అధికార పార్టీలోకి వెళ్లున్న కుమారుడు
►సంగారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది.
నేడు నర్సంపేటకు ఆర్‌ఎస్పీ
►బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎన్నికల ప్రచారం
►నేడు నర్సంపేటకు హెలికాప్టర్‌లో రానున్న ఆర్‌ఎస్పీ
►బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుండాల మధన్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రవీణ్ కుమార్.
►నర్సంపేట పట్టణంలో రోడ్ షో.
►ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ముందు కార్నర్ మీటింగ్.
నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కనకయ్య గౌడ్ ఆత్మహత్య
►మృతుడి ఫోన్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ
►మృతుడు అర్బన్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ
►రెండు రోజుల్లో గృహప్రవేశం ఉండగా ఇంతలో కనకయ్య ఆత్మహత్య
హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
►బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు.
►కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి నారాయణపేట బయలుదేరనున్న నడ్డా.
►ఉదయం 11 గంటలకు నారాయణపేటలో బీజేపీ సభలో పాల్గొననున్న నడ్డా.
►మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ సభలో పాల్గొననున్న నడ్డా.
►సాయంత్రం ఐదు గంటలకు మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో
నేడు పెద్దపల్లి జిల్లాకు ఎమ్మెల్సీ కవిత
►బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
►జగిత్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో ఈరోజు ఎమ్మెల్సీ కవిత పర్యటన
►ఉదయం ధర్మపురి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోనున్న కవిత
►ఆ తర్వాత ధర్మపురిలో మహిళలతో ముఖాముఖి
►ఆ తర్వాత గొల్లపెల్లి, పెగడపెల్లి మండలాల్లో ప్రచారం
►ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు తరపున ప్రచారం
►సాయంత్రం పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గం కమాన్ పూర్‌లో ప్రచారం..
►పెద్దపెల్లి నియోజకవర్గ కేంద్రంలో ప్రచారంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత.
నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ
►కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు.
►ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ.
►ఖానాపూర్, ఆసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్లొననున్న ప్రియాంక
►నాందేడ్ నుండి హెలికాప్టర్‌లో ఖానాపూర్‌కు రానున్న ప్రియాంక
నేడు తెలంగాణకు జేపీ నడ్డా
►బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు.
►నారాయణపేట, చేవెళ్లలో బహిరంగ సభలకు నడ్డా హాజరుకున్నారు.
►మల్కాజిగిరిలో రోడ్‌షోలో పాల్గొననున్న జేపీ నడ్డా.
►రేపు కొల్లాపూర్, ఎల్లారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న నడ్డా.
నేడు పాలమూరుకు సీఎం కేసీఆర్
►సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
►అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment