ఒక్కరోజు సభా నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా​..?

TDP MLAs suspended From AP Assembly for Two Days - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్‌ గురయ్యారు. రెండు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగించడంతో స్పీకర్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల తీరును స్పీకర్‌ తప్పుపట్టారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీరియస్‌ అయ్యారు.

ఒక రోజు శాసనసభ నిర్వహణకు రూ.53.28లక్షలు ఖర్చవుతుంది. ఒక నిమిషం సభ నిర్వహణకు రూ. 88,802 ప్రజాధనం ఖర‍్చవుతుంది. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని చర్చిండానికి ఇంత ఖర్చుపెడుతుంటే టీడీపీ సభ్యులు సభా సమయాన్ని ఇలా నిరుపయోగం చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top