
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఉప ఎన్నికలు సందర్భంగా నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర్య అభ్యర్థి పట్ల టీడీపీ నేతలు రౌడీయిజం సృష్టించారు. శ్రీదేవి అనే స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి రాగా, ఆమెను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె నామినేషన్ వేయకుండా చేసేందుకు నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోయారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఆమెను టీడీపీ నాయకుడు ఆనంద్‌రెడ్డి తన అనుచరులతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ఆమె వద్దనున్న నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు.
దీనిపై శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి , ఇలా రౌడీయిజం చేసి కాదు. నామినేషన్ పత్రాలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, 5వేల నగదు ఎత్తుకు వెళ్లారు. ఎస్.ఐ దగ్గర ఉన్నా, మాపై దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదు’ అని ఆమె విమర్శించారు.