మధురవాడలో టీడీపీ నేత హల్‌చల్‌

TDP Leader Hulchul In Madhurawada - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో టీడీపీ నేత మొల్లి లక్ష్మణరావు హల్‌చల్‌ సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్‌నంటూ వార్డు సచివాలయంలో కార్యకర్తలతో కలిసి లక్ష్మణరావు తనిఖీలు చేశారు. జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్‌ తండ్రి లక్ష్మణరావు.. కుమార్తె స్థానంలో తానే కార్పొరేటర్‌ అంటూ నానా హంగామా చేశారు. సచివాలయంలో సిబ్బంది వివరాలు చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. ఇకపై సచివాలయంలో తనకు తెలీకుండా ఏమీ జరగకూడదంటూ హుకుం జారీ చేశారు.

చదవండి: భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు: అంబటి
త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు: ఆదిమూలపు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top