అంతుచూస్తా.. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యం | Tdp Leader Byreddy Rajasekhar Reddy Over Action On Cpm Leaders | Sakshi
Sakshi News home page

అంతుచూస్తా.. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యం

Aug 11 2024 5:02 PM | Updated on Aug 11 2024 5:07 PM

Tdp Leader Byreddy Rajasekhar Reddy Over Action On Cpm Leaders

నందికొట్కూరు మునిసిపాలిటీలో స్థల వివాదంలో సీపీఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు.

సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు మునిసిపాలిటీలో స్థల వివాదంలో సీపీఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. రెచ్చిపోయిన బైరెడ్డి.. అంతుచూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ సీపీఎం నాయకులపై చిందులు తొక్కారు.

20 ఏళ్లుగా ఈ స్థలంలోనే ఉన్నాం.. పన్నులు చెలిస్తున్నాం. న్యాయం చేయకపోగా మాపైనే దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి మేము పన్నులు కూడా చెల్లించామని.. తమకు న్యాయం చేయమంటే మున్సిపాలిటీ అధికారులు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన బాటపట్టారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement