
సాక్షి, కోనసీమ జిల్లా: ‘‘జనసేన నేతలు ఏ కార్యక్రమం చేసిన సీఎం చంద్రబాబు ఫోటో వేస్తున్నాం. కానీ, టీడీపీ నేతలు కార్యక్రమం చేస్తే పవన్ కల్యాణ్ ఫోటో అసలు వేయడం లేదు’’ అంటూ జనసేన కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం పి.గన్నవరంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో(Auto Driver Sevalo) కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. డ్రైవర్లకు ఇచ్చిన చెక్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడమే ఇందుకు కారణం.

దీంతో.. స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ-జనసేన నాయకులు ఘర్షణకు(TDP Jana Sena Clash) దిగారు. వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసేసుకున్నారు. రవాణా శాఖ అధికారులు ముద్రించిన పాంప్లెట్, మెగా చెక్కులోనూ పవన్ ఫోటో లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఈ తరుణంలో..

ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ(MLA Giddi Satyanarayana) ‘పోనీ..’ అంటూ వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రతీ విషయంలో తామే సర్దుకుపోతున్నామని, టీడీపీ వాళ్లు మాత్రం వాళ్లు చేసేది చేసుకుంటూ పోతున్నారంటూ జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఇంకో దుర్మార్గానికి తెర లేపిన నారా ఫ్యామిలీ!