మాల ఉద్యోగుల పరిరక్షణకు కృషి
మాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రత్నప్రసాద్
అమలాపురం టౌన్: మాల ఉద్యోగులపై జరుగుతున్న దాడుల నియంత్రణకు, వాటిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు మాల ఉద్యోగుల పరిరక్షణ సమితి కృషి చేస్తుందని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బూసా రత్న ప్రసాద్ తెలిపారు. స్థానిక సర్ ఆర్థర్ కాటన్ పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఆదివారం జరిగిన జిల్లా మాల గెజిటెడ్ అధికారులు, మాల హక్కుల పరిరక్షణ సమితి సమావేశానికి రత్న ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమితి జిల్లా ప్రతినిధి పి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం మాల గెజిటెడ్ అధికారుల హక్కుల పరిరక్షణపై చర్చించింది. సమావేశంలో మాల హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు చింతా వెంకటేశ్వర్లు, సమతా సైనిక దళ్ నాయకురాలు శ్వేత మాట్లాడారు.
జిల్లా కమిటీ చైర్మన్‌గా ప్రసాదరావు
అనంతరం సమావేశం మాల గెజిటెడ్ అధికారులు, మాల హక్కుల పరిరక్షణ సమితికి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కమిటీ చైర్మన్‌గా నాగాబత్తుల ప్రసాదరావు, కో చైర్మన్లుగా పెనుమాల చిట్టిబాబు, కాశి వెంకటరావు, రేవు ఈశ్వరరావు, కన్వీనర్‌గా కుసుమ ప్రభుదాస్, కో కన్వీనర్లుగా నాగాబత్తుల నరసింహమూర్తి, బీవీవీ సత్యనారాయణ, కోశాధికారిగా సాపే బాలరవి, లీగల్ అడ్వైజర్‌గా ఐఎన్ మల్లేశ్వరరావు, ఈసీ సభ్యులుగా వి.భానోజీరావు, కత్తుల ఆనందరావు, ముత్తాబత్తుల ఆనందరావు, సరెళ్ల సంజీవరావు, బి. సాల్మన్‌రాజు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని సమితి రాష్ట్ర అధ్యక్షుడు రత్న ప్రసాద్ తదితరులు అభినందించారు. మాల ఉద్యోగులపై దాడులు జరగకుండా నూతన కమిటీ పర్యవేక్షించాలని ఆయన సూచించారు.


