సావిత్రి బాయి ఫూలేకు నివాళులు | - | Sakshi
Sakshi News home page

సావిత్రి బాయి ఫూలేకు నివాళులు

Mar 11 2026 7:34 AM | Updated on Mar 11 2026 7:34 AM

అమలాపురం టౌన్‌: మహిళా విద్యకు పునాది వేయడమే కాకుండా సమాజంలో మహిళలకు విద్యాపరంగా గుర్తింపు తెచ్చిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురంలోని శెట్టిబలిజ గ్రంథాలయంలో మంగళవారం జరిగిన సావిత్రి బాయి ఫూలే వర్ధంతి సభలో మాజీ ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ప్రసంగించారు. తొలుత శెట్టిబలిజ గ్రంథాలయంలో గల సావిత్రి బాయి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ అనురాధ మట్లాడుతూ తొలి భారతీయ ఉపాధ్యాయురాలిగా, గొప్ప సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా అలనాడు సమాజానికి అందించిన సేవలు నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), రాష్ట్ర శెట్టిబలిజ మహానాడు అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ నాయకులు కుడుపూడి త్రినాథ్‌, మోటూరి సత్యం కాపు, నిమ్మకాయల అంబికా శ్రీను, చప్పిడి శోభన్‌బాబు, ముంగర ప్రసాద్‌, గుత్తుల ధర్మ, పితాని చిన్నారెడ్డి సావిత్రి బాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement