సాధారణంగానే గ్యాస్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

సాధారణంగానే గ్యాస్‌ సరఫరా

Mar 11 2026 7:34 AM | Updated on Mar 11 2026 7:34 AM

అమలాపురం రూరల్‌: ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్‌ సరఫరాపై కొన్ని అపోహలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్నాయని వాటిలో వాస్తవం లేదని జాయింట్‌ కలెక్టర్‌ టీ నిషాంతి మంగళవారం రాత్రి ప్రకటనలో స్పష్టం చేశారు. కోనసీమ జిల్లాలో గ్యాస్‌ కొరత లేదన్నారు. గ్యాస్‌ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్‌ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే ఆన్‌లైన్‌లో గ్యాస్‌ బుకింగ్‌ చేయడానికి వెబ్‌ పోర్టల్‌ అనుమతించదని, 21 రోజుల వ్యవధిలో మాత్రమే గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. ఆసుపత్రి అత్యవసర సేవలకు గ్యాస్‌ సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలకు గ్యాస్‌ నిలుపుదల చేసినట్లు ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. గ్యాస్‌ బుకింగ్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల వల్ల మంగళవారం బుకింగ్‌లు నిలిచిపోయాయని, ఇప్పుడు పోర్టల్‌ యథావిధిగా పని చేస్తోందన్నారు.

జేసీ నిషాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement