పండగ సందడి లేదు
సంక్రాంతి పండగ అంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా సంతోషంగా గడిపేవారు. కానీ ఈ ఏడాది సంక్రాంతి పండగకు ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జనవరి నెల ప్రారంభం నుంచీ సందడి సందడిగా ఉండేది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దూరంగా ఉన్న వారు వస్తేకానీ పండగ వాతావరణం రావడం లేదు. సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత సంక్రాంతి పండగ రీల్స్‌లో మాత్రమే కనిపిస్తోంది.
– గంటి శ్రీరామ్మూర్తి, రిటైర్డ్ ఉద్యోగి, అంబాజీపేట
తప్పదన్నట్టు తిరుగుతున్నాం
గంగిరెద్దులు ఊరూరా తిప్పుకుంటూ ఉపాధి పొందుతున్నాం. సంక్రాంతి సమయంలోనే నాలుగు డబ్బులు వస్తున్నాయి. గతంలో ఈ పండగ సమయంలో వచ్చిన సొమ్ములు ఏడాదంతా సరిపోయేవి. ఇప్పుడు పండగ అయిన వెంటనే కూలీ పనులకు వెళ్లకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది.
– పోసయ్య, ముక్కామల,
అంబాజీపేట మండలం
పండగ సందడి లేదు


