పొన్నూరు సభలో చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు | TDP Clash Leaders In Chandrababu Meeting At Ponnur Guntur District | Sakshi
Sakshi News home page

పొన్నూరు సభలో రభస.. చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

Dec 9 2022 4:11 PM | Updated on Dec 9 2022 4:28 PM

TDP Clash Leaders In Chandrababu Meeting At Ponnur Guntur District - Sakshi

పొన్నూరు చంద్రబాబు సభలో తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు.

సాక్షి, గుంటూరు జిల్లా: పొన్నూరు చంద్రబాబు సభలో తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఐలాండ్ సెంటర్‌లో చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. ఆ పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌లో దూరారు. తెలుగు తమ్ముళ్లు పీకల వరకు మద్యం సేవించి బయటికి వచ్చి తాగిన మైకంలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు.

ఒక వైపు చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. మరో వైపు టీడీపీ నేతలు మాత్రం ఆయనను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పాటు కాళ్లతో ఎగిరేగిరి తన్నుకున్నారు. ఇది చూసిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరకు పోలీసులు రంగంలో దిగడంతో తెలుగుదేశం పార్టీ తాగుబోతు తమ్ముళ్ల గొడవ సద్దుమణిగింది గొడవపడేవారిని విడదీసి పోలీసులు పంపించేశారు.
చదవండి: చంద్రబాబు వీక్‌నెస్‌ అదే.. కొంప మునగడం ఖాయమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement