
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకుంది ఆ పార్టీ. మంగళవారం జరిగిన ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు, చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు టీడీపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు.
