బరిహాసం | - | Sakshi
Sakshi News home page

బరిహాసం

Jan 14 2026 7:10 AM | Updated on Jan 14 2026 7:10 AM

బరిహా

బరిహాసం

జోసఫ్‌ తంబి మహోత్సవాలు బ్రదర్‌ జోసఫ్‌ తంబి పుణ్యక్షేత్రంలో 81వ వర్ధంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫాదర్‌ ప్రత్తిపాటి మరియదాసు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. uIIలో బరిహాసం

న్యూస్‌రీల్‌

తిరువూరు నియోజకవర్గంలో..

సంక్రాంతి సంబరాల పేరుతో ‘బరి’తెగింపు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి కోడిపందేలకు ఏర్పాట్లు జూద క్రీడలు, క్యాసినో నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జూదరులను ఆకర్షించేందుకు ప్రత్యేక బహుమతులతో ఎర హైటెక్‌ హంగులతో రూ.కోట్లు దండుకొంటున్న పచ్చనేతలు

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.7890 టీఎంసీలు.

జోసఫ్‌ తంబి మహోత్సవాలు బ్రదర్‌ జోసఫ్‌ తంబి పుణ్యక్షేత్రంలో 81వ వర్ధంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫాదర్‌ ప్రత్తిపాటి మరియదాసు ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
ఎన్టీఆర్‌ జిల్లా
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
uIIలో

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంక్రాంతి సంబరాల ముసుగులో ‘పచ్చ’నేతలు బరితెగిస్తున్నారు. బరులను క్యాటగిరీల వారీగా విభజించి ఏర్పాట్లు పూర్తిచేశారు. బరి స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.2 కోట్లకు పైగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వసూలు చేస్తున్నారు. పోలీసులు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లు అందినకాడికి దండుకుంటున్నారు. మొదట్లో బరుల వద్ద బ్యానర్లు కట్టి, కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఆ తరువాత బరికి రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నట్లు బరుల నిర్వాహకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

బరుల వద్ద భారీ ఏర్పాట్లు

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు కోడిపందేల బరుల వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్దబరులే 50 వరకు ఉండగా, చిన్నవి లెక్కకు మించి ఉన్నాయి. ఒక్కొక్క బరి వద్ద వేల మంది కూర్చొని పందేలు తిలకించేలా వసతులు సమకూర్చారు. హైటెక్‌ హంగులతో భారీ బరులను తీర్చిదిద్దారు. కళ్ల ముందే బరులు కనిపిస్తున్నా తమకు ఏమీ పట్టదన్నట్లు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు వ్యహరిస్తున్నారు. కోడి పందేలు, క్యాసినో వంటి జూద క్రీడల నిర్వహణకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద మద్యం ఏరులై పారనుంది. ఇందుకు అనుగుణంగా బరుల వద్దనే ప్రత్యేకంగా మద్యం స్టాళ్లు ఏర్పాటు చేశారు. బరి స్థాయికి అనుగుణంగా మూడు రోజుల పాటు కోడి పందేలతోపాటు క్యాసినో, జూద క్రీడలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బరుల వద్దే మందు, విందు ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధుల ఫొటోలతో నిర్వాహకులు బ్యానర్లు ఏర్పాటు చేసి బరుల వద్దకు ఆహ్వానిస్తున్నారు. కోడిపందేలు, జూదాలను నిర్వహిస్తే సహించేది లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా పచ్చనేతలు మాత్రం ధిక్కరించారు.

విజయవాడ రూరల్‌ మండలంలో..

విజయవాడ రూరల్‌ మండలంలోని జక్కంపూడి గ్రామం పాములకాలువ వద్ద టీడీపీ నాయకుడు పరుచూరి ప్రసాద్‌ కోడి పందేలు, గుండాట, కోతముక్కు తదితర జూదాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కొత్తూరు తాడేపల్లిలో టీడీపీ కమిటీ నాయకులు బరి ఏర్పాటు చేశారు. పైపుల రోడ్డు దగ్గర అంబాపురం పరిధిలో టీడీపీ నాయకుడు, బొండా ఉమా అనుచరుడు పెప్సీ నిర్వహణలో కోడి పందేల బరి ఏర్పాటైంది. విజయవాడ రూరల్‌ మండలంలోని కొత్తూరు తాడేపల్లిలో టీడీపీ నాయకుడు బొర్రా పున్నారావు ఆధ్వర్యంలో ఇప్పటికే కోడి పందేల బరులను సిద్ధం చేశారు.

నందిగామ నియోజకవర్గంలో..

మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో 20 ఎకరాల విస్తీర్ణంలో లాల్‌ బహుదూర్‌ కెనాల్‌ చైర్మన్‌, టీడీపీ నాయకుడు కోట వీరబాబు ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు చేశారు. వీరులపాడు మండలంలో దాచవరంలో పదెకరాల్లో కోడిపందేల బరులు సిద్ధమయ్యాయి. కంచికచర్ల మండలంలో కీసర, గండేపల్లి, ఐతవరం మునేటి ఒడ్డున కోడి పందేల శిబిరాలు ఏర్పాటు చేశారు.

జగ్గయ్యపేట నియోజకవర్గంలో..

నియోజవర్గంలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలో కోడి పందేలు నిర్వహించేందుకు బరులను ఏర్పాటు చేశారు. పట్టణంలోని సత్యనారాయణపురంలోని ఇండ్ల ప్లాట్లలో టీడీపీ నాయకులు కోనసీమ తరహాలో పేకాట, కోడి పందేలు, గుండాట నిర్వహణకు ప్రత్యేక టెంట్లు వేశారు. బుధవారం భోగి పండుగ సందర్భంగా ఈ కోడి పందేలను ప్రారంభించేందుకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఆహ్వానించారు. నవాబుపేట, పెనుగంచిప్రోలులోని మామిడి తోటలు సైతం కోడి పందేలకు సిద్ధమవుతున్నాయి.

మైలవరం నియోజకవర్గంలో..

మైలవరం నియోజకవర్గంలో 30కి పైగా ప్రధాన బరులు ఉన్నాయి. మైలవరంలో టీడీపీ నాయకులు గంగరాజు, లంకా లితీష్‌, పొందుగలలో నాగరాజు, మొర్సుమల్లిలో చల్లా సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ బరులు ఏర్పాటు చేశారు. వెల్వడం, చండ్ర గూడెం, గణపవరం, రెడ్డిగూడెం మండలంలో రెడ్డి గూడెం, రంగాపురంలో పెద్ద బరులను ఏర్పాటు చేశారు. జి.కొండూరు మండలంలో కోడూరు, చేగిరెడ్డిపాడు, చెర్వుమాధవరం, మునగపాడు, గంగి నేని, జి.కొండూరులో బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మూలపాడులో భారీ బరులను ఏర్పాటు చేస్తున్నారు. తుమ్మలపాలెం, చిలుకూరులో బరులు ఏర్పాటు చేస్తున్నారు.

గన్నవరం నియోజకవర్గంలో..

గన్నవరం మండలం కేసరపల్లిలోని గోకరాజు గంగరాజుకు చెందిన 23 ఎకరాల్లో టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందేలకు ఒక పెద్ద బరితో పాటు మరో నాలుగు చిన్నవి సిద్ధం చేశారు. పేకాట, క్యాసినో కోసం భారీ వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేశారు. కోతముక్క, ఇతర జూద క్రీడలు, ఫుడ్‌ స్టాళ్లును సిద్ధం చేశారు. ఈ బరికే నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నిర్వాహకులు రూ.2 కోట్లకు పైగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. తెంపల్లి, వీరపనేనిగూడెం, సూరంపల్లి, ముస్తాబాద, గోపవరపు గూడెం, మర్లపాలెం, చిన్నఆవుటపల్లి గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు టీడీపీ నాయకులు బరులను సిద్ధం చేశారు. విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడు ఫ్లై ఓవర్‌ సమీపంలో టీడీపీ నేతలు సంక్రాంతి సంబరాలు ముసుగులో నాలుగు ఎకరాల్లో కోడి పందెల బరి ఏర్పాటు చేశారు. పేకాట, గుంటాట కోసం ప్రత్యేక స్టాళ్లను సిద్ధం చేశారు. రాత్రులు కూడా పందేలు నిర్వహించేందుకు ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేశారు.

పెనమలూరు నియోజకవర్గంలో..

పెనమలూరు నియోజకవర్గంలో కోడి పందేలకు హైటెక్‌ హంగులతో ఏర్పాట్లు చేశారు. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో కోడిపందేలు, జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. పెదపులిపాక గ్రామంలో అనంతనేని ఆజాద్‌, బబ్లూ నేతృత్వంలో కోడి పందేలు, జూదాలు నిర్వహించనున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా నేతృ త్వంలో బరి ఏర్పాటు చేవారు. కంకిపాడు పట్ట ణంలో బైపాస్‌ వెంబడి, గొడవర్రు, ఉప్పులూరు గ్రామాల్లో, ఉయ్యూరు మండలం చినఓగిరాలలో బరులు సిద్ధమయ్యాయి.

తిరువూరు నియోజకవర్గంలో ప్రధానంగా 20 కోడిపందేల బరులు సిద్ధమయ్యాయి. విస్సన్నపేట మండలం తాతకుంట్లలో భారీ సెట్టింగ్‌లతో బరి ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కోడి పందేలతో పాటు గుండాట, పేకాట తదితర జూదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బరిహాసం 1
1/3

బరిహాసం

బరిహాసం 2
2/3

బరిహాసం

బరిహాసం 3
3/3

బరిహాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement