breaking news
lp leader
-
టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకుంది ఆ పార్టీ. మంగళవారం జరిగిన ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు, చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు టీడీపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. -
జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ శాసన సభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోకి పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జనసేన సీనియర్.. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, పవన్ పేరును ప్రతిపాదించగా.. అందుకు జనసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవుల కోసమూ ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాసేపట్లో విజయవాడలో జరగబోయే ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి పవన్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. -
బీజేపీ శాసన సభాపక్ష నేత ఎంపికపై ఉత్కంఠ
-
వైఎస్ఆర్ ఎల్పీ నేతగా వైఎస్ జగన్ ఎన్నిక
-
నేడు జనం ముందుకు జయలలిత
-
నేడు జనం ముందుకు జయలలిత
ఎల్పీ నేతగా ఎన్నుకోనున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు! చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం తొలిసారి జనం ముందుకు రానున్నారు. ఆమె ఉదయం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. భేటీలో ఆమెను తిరిగి శాసనసభా పక్ష (ఎల్పీ) నేతగా ఎన్నుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశం తర్వాత ఆమె నగరంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, ద్రవిడ నేత అన్నాదురై, హేతువాద నేత పెరియార్ రామస్వామి విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. ‘అమ్మ’ దర్శనం కోసం పార్టీకార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆస్తుల కేసులో బెయిల్‌పై గత ఏడాది అక్టోబర్‌లో బెంగళూరు నుంచి చెన్నై వచ్చాక జయ ఇంటికే పరిమితమయ్యారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెను ఇటీవల నిర్దోషిగా తేల్చడం తెలిసిందే. జయ సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనే దానిపై పార్టీ నేతలు పెదవి విప్పకున్నా ఈ నెల 22-24 మధ్య ఆమె ప్రమాణం చేసే అవకాశముందని భావిస్తున్నారు. అడ్డుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ జయ ఆస్తుల కేసు నుంచి బయటపడిన నేపథ్యంలో ఆమె తిరిగి తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం జీఎస్ మణి అనే న్యాయవాది పిటిషన్ వేశారు. ఉన్నత కోర్టుల్లో నిర్దోషులుగా తేలిన వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు సుప్రీం కోర్టులో పరిష్కారమయ్యేవరకు వారి పునర్నియామకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు జయ సీఎం కాకుండా అడ్డుకోవాలని కోరుతూ రవిరాజ్ గురురాజ్ కులకర్ణి అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు గురువారం కొట్టేసింది. ప్రచారం కోసమే దీన్ని వేశారంటూ కులకర్ణికి రూ. 25 వేల జరిమానా విధించింది.